‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో CM రేవంత్‌పై ప్రశ్న.. తడబడి నిలబడిన కంటెస్టెంట్!

కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిగ్ బీ ప్రశ్న అడిగారు. ఆ ఎపిసోడ్ లో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పలేకపోయింది. తడబడినా చివరికి నిలబడగలిగింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే?

కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిగ్ బీ ప్రశ్న అడిగారు. ఆ ఎపిసోడ్ లో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పలేకపోయింది. తడబడినా చివరికి నిలబడగలిగింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే?

టెలివిజన్ లో ప్రసారమవుతున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్ కు విశేషమైన ఆధరణ లభించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో బుల్లితెరపై దూసుకెళ్తోంది. ప్రస్తుతం 15వ సీజన్ దిగ్విజయంగా సాగిపోతున్నది. ఇక ఈ సీజన్ లో జరిగిన ఓ ఎపిసోడ్ లో బిగ్ బీ అందులో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ప్రశ్న అడిగారు. అయితే అమితాబ్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ఆఖరికి తడబడినా లైఫ్ లైన్ తీసుకుని షోలో నిలబడగలిగింది. కాగా ఈ నెల 15న ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్ ప్రోగ్రామ్ లో ఇది చోటుచేసుకుంది.

కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్ లో పాల్గొనే కంటెస్టెంట్లకు వివిధ రకాలైన ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతులు అందిస్తారు. ఇందులో పాల్గొనే వారు గరిస్ఠంగా 7 కోట్ల రూపాయలు వరకు గెలుచుకునే అవకాశం ఉంది. కౌన్‌ బనేగా కరోడ్‌పతి షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు నాలెడ్జ్ ను కూడా అందిస్తోంది. అయితే ఈ ప్రోగ్రాంలో పాల్గొనే కంటెస్టెంట్ల్ అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉంటారు. కాగా హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రం కొన్ని ప్రశ్నలకు తడబడిపోతుంటారు. ఇదే విధంగా కేబీసీ 15 సీజన్ లో పాల్గొన్న ఓ లేడీ కంటెస్టెంట్ తెలంగాణ సీఎంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది.

కౌన్ బనేగా కరోడ్ పతి షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బీ హాట్ సీట్ లో కూర్చున్న ఆ లేడీ కంటెస్టెంట్ ను రూ. 40 వేలకు సంబంధించిన ప్రశ్నను అడిగారు. ఆ ప్రశ్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ కు సంబంధించింది. ఆ ప్రశ్న ఏంటో తెలుసా.. ‘రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు?’. ఈ ప్రశ్నకు గానూ.. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఆంధప్రదేశ్‌‌ను ఆప్షన్లుగా ఇచ్చారు. అయితే.. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియని ఆ యువతి ఆలోచనలో పడిపోయింది. షోలో ముందుకు సాగాలంటే ఈ ప్రశ్రకు సమాధానం చెప్పి తీరాలి కాబట్టి వెంటనే తనకున్న లైఫ్ లైన్ ను వినియోగించుకుంది.

లైఫ్ లైన్ లో భాగంగా ఆడియెన్స్ పోల్ తీసుకోగా ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మంది తెలంగాణ అని సూచించారు. దీంతో.. ఆ లేడీ కంటెస్టెంట్ కూడా మెజార్టీ ఆడియన్స్ అభిప్రాయాన్ని తీసుకుని తెలంగాణను లాక్ చేసింది. బిగ్ బీ రేవంత్ రెడ్డిపై అడిగిన ప్రశ్నకు తెలంగాణ సరైన సమాధానం కావడంతో.. ఆ లేడీ కంటెస్టెంట్ షో నుంచి ఎలిమినేట్ కాకుండా తర్వాతి ప్రశ్నకు వెల్లగల్గింది. మరి కౌన్ బనేగా కరోడ్ పతి షోలో తెలంగాణ సీఎం రేవంత్ పై ప్రశ్న అడగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments