ఆ రెండు మూవీస్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయా? టాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్

Pushpa-2 , Game Changer Movies: టాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్స్ మొదలయ్యాయా అనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశాయి. మరి రాబోయే సినిమాలకు ఈ ఈవెంట్స్ జరుగుతాయా లేదా అనే డౌట్స్ మొదలయ్యాయి. ఆ విషయాలేంటో చూసేద్దాం.

Pushpa-2 , Game Changer Movies: టాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్స్ మొదలయ్యాయా అనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశాయి. మరి రాబోయే సినిమాలకు ఈ ఈవెంట్స్ జరుగుతాయా లేదా అనే డౌట్స్ మొదలయ్యాయి. ఆ విషయాలేంటో చూసేద్దాం.

ఒక సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అప్పటివరకు మూవీని ఎంత జాగ్రత్తగా తీశారు అనేది ఎంత ముఖ్యమో.. దానిని ప్రేక్షకులలోకి తీసుకుని వెళ్లడం కూడా అంతే ముఖ్యం. అసలు సినిమా ఎందుకు చూడాలి.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటి.. ఇలా ఎన్నో విషయాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో గెస్ట్స్ చెప్తూ ఉంటారు. దీనితో ఈ ఎఫెక్ట్ ఎంతో కొంత సినిమాపై ఉంటుంది. అప్పటివరకు ఎలాంటి హైప్ లేని సినిమాలకు.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ బజ్ క్రియేట్ చేస్తాయి. అయితే ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్ మొదలయ్యిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సినిమాలకు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగలేదు.

రీసెంట్ గా రిలీజ్ అయినా దేవర మూవీ విషయంలో ఏం జరిగిందో తెలియనిది కాదు. అప్పటివరకు సినిమా పైన బాగానే హైప్ కొనసాగింది. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రౌడ్ ఎక్కువ అవ్వడంతో.. ఈవెంట్ నే క్యాన్సిల్ చేశారు. దీనితో ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. మూవీపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అని భయపడ్డారు. కట్ చేస్తే మూవీ ఐదు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. డివైడ్ టాక్ తో మొదలైన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక దీనికంటే ముందు వచ్చిన కల్కి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. బుజ్జి కార్ ను ప్రభాస్ ద్వారా అందరికి పరిచయం చేసిన నాగ్ అశ్విన్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం నిర్వహించలేదు. దీనితో కథలో కంటెంట్ లేదేమో.. అందుకే ఈవెంట్ ను నిర్వహించలేదేమో.. అని రకరకాల రూమర్స్ వచ్చాయి. తీరా చూస్తే కల్కి రిలీజ్ తర్వాత.. సినిమా గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. అలాగే ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ సినిమా విషయంలోను ఇదే రిపీట్ అయింది. ప్రశాంత్ నీల్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే .. నేరుగా ప్రభాస్ విశ్వరూపాన్ని వెండి తెరపై చూపించాడు. ఆ సమయంలో ఈ సినిమా గురించి వినిపించిన టాక్ అంతా ఇంతా కాదు. ఇలా చూసినట్లయితే ప్రేక్షకులను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిరాశ పరిచినా .. సినిమాలోని కంటెంట్ మాత్రం ఫుల్ కిక్ ఇస్తుంది.

దీనితో ఇప్పుడు టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విషయంలో.. కొత్త సెంటిమెంట్ మొదలయ్యిందా అనే టాక్ వినిపిస్తుంది. మరి కళ్ళ ముందే దానికి నిదర్శనాలు కనిపిస్తుంటే ఇలాంటి సందేహాలు రావడంలో తప్పు లేదు. అయితే ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే. ఈ క్రమంలో ఇప్పుడు రిలీజ్ కు రెడీ గా ఇంకా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప-2. ఈ రెండు సినిమాలు కూడా ఒకే నెలలో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. మరి కనీసం ఈ సినిమాలకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయో.. లేదా వీరు కూడా అన్నీథియేటర్ లోనే అంటారో చూడాలి. ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు. ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments