‘ముఫాసా:ది లయన్ కింగ్’ తెలుగు ట్రైలర్ లో.. మహేష్ వాయిస్ కు గూస్ బంప్స్ పక్కా

Mufasa the lion king Movie telugu trailer :హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఇక ఈ మూవీ లో ముఫాసా క్యారెక్టర్ కు మహేష్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ట్రైలర్ ఎలా ఉందొ చూసేద్దాం.

Mufasa the lion king Movie telugu trailer :హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఇక ఈ మూవీ లో ముఫాసా క్యారెక్టర్ కు మహేష్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ట్రైలర్ ఎలా ఉందొ చూసేద్దాం.

హాలీవుడ్ మూవీ కోసం మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు కొన్ని రోజుల క్రితం.. సోషల్ మీడియాలో పోస్ట్స్ వైరల్ అయ్యాయి. దీనితో మహేష్ వాయిస్ ను ఎప్పుడెప్పుడు విందామా అని అభిమానులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఆరోజు రానే వచ్చింది. తాజాగా హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనిలో మహేష్ వాయిస్ విని అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మరి ట్రైలర్ ఎలా ఉందో.. ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసిందో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

ముఫాసా ది లయన్ కింగ్.. ఈ మూవీ కోసం అటు హాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూశారు. డిసెంబర్ 20న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై ఇంకాస్త అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో ముఫాసా క్యారెక్టర్ కు మహేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్.. సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుందని చెప్పి తీరాల్సిందే.ఈ క్రమంలో మహేష్ ఈ ట్రైలర్ ను పోస్ట్ చేస్తూ..’మనకు తెలిసి ఇష్టపడే పాత్రకు ఇదొక కొత్త కోణం. తెలుగులో ముఫాసా పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైంది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రైలర్ దూసుకుపోతుంది.

ఇక ముఫాసా కథ విషయానికొస్తే… మొదటి పార్ట్ లో అడవికి రాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండేవాడు. అతనికి సింబల్ అనే కొడుకు కూడా జన్మిస్తాడు. ఇక ఇప్పుడు రానున్న ఈ ప్రిక్వెల్ లో అసలు ముఫాసా అడవికి రాజుగా ఎలా ఎదిగాడు. అతని సోదరుడు టాకా ఎలా చనిపోయాడు. అలాగే అతనిని చంపాలని చూస్తున్న వారు ఎవరు ? ఇలా ఈ సిక్వెల్ లో పూర్తిగా కథ అంతా కూడా ముఫాసా చుట్టూనే తిరగబోతుంది. కచ్చితంగా మొదటి పార్ట్ లానే ఈ పార్ట్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ముఫాసా లయన్ కింగ్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments