Somesekhar
'ఆ కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు మహేష్, శ్రీలీల వేసిన స్టెప్పులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఇక గుంటూరు కారం మూవీలో తన డ్యాన్స్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సూపర్ స్టార్.
'ఆ కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు మహేష్, శ్రీలీల వేసిన స్టెప్పులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఇక గుంటూరు కారం మూవీలో తన డ్యాన్స్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సూపర్ స్టార్.
Somesekhar
సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం మూవీతో తనలో ఉన్న మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఇక ఈ మూవీలో కొత్త మహేష్ ను చూస్తారు అని ముందునుంచే చెప్పుకొచ్చినట్లుగానే కొత్తగా కనిపించారు ప్రిన్స్. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఈ మూవీలో మాస్ డ్యాన్స్ తో మెస్మరైజ్ చేశారు. మరీ ముఖ్యంగా ‘ఆ కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కు మహేష్, శ్రీలీల వేసిన స్టెప్పులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీలో తన డ్యాన్స్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సూపర్ స్టార్.
గుంటూరు కారం మూవీ కంటే ముందు మహేష్ బాబు యాక్టింగ్, యాక్షన్ సీన్స్, కామెడీ టైమింగ్ గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ మూవీ తర్వాత కచ్చితంగా మహేష్ డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటారు. అంతలా ఈ చిత్రంలో తన స్టెప్పులతో మెప్పించారు ప్రిన్స్. గత చిత్రాలతో పోలిస్తే.. సూపర్ స్టార్ గుంటూరు కారంలో డ్యాన్స్ ఇరగదీశారు. తమన్ మ్యూజిక్ కు మహేష్ స్టెప్పులు యాడ్ అవ్వడంతో.. ఆ పాటలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇక గుంటూరు కారంలో తన డ్యాన్స్ గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు మహేష్. షూటింగ్ సమయంలో ‘ఆ కుర్చీ మడతపెట్టి’ సాంగ్ తన కెరీర్ లో పెద్ద హిట్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు కూడా చెప్పారట.
సినిమా జనవరి 12న విడుదల చేయాల్సి ఉంది. ఇంకా సాంగ్ షూటింగ్ ఉంది. డిసెంబర్ 22, 23న సాంగ్ షూటింగ్ చిత్రీకరిస్తున్నారు. దీంతో తమ మీద తీవ్ర ఒత్తిడి ఉందని మహేష్ అన్నారు. ఎలాగైనా సాంగ్ కంప్లీట్ చేయాలని.. ఆ సాంగ్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఇలాంటి సాంగ్ మళ్లీ చేస్తానో లేదో అని ఇదే విషయాన్ని శేఖర్ మాస్టర్ కు చెప్పారట మహేష్. శ్రీలీలతో డ్యాన్స్ అంటే భయం వేసేదని.. ఆమె డ్యాన్స్ ను తాను మ్యాచ్ చేస్తే చాలు.. ఓ అద్భుతం జరుగుతుందని మహేష్ ఫీలయ్యారట. ఈ సాంగ్ లో అదే జరిగిందంటూ చెప్పుకొచ్చారు మహేష్. నిజంగానే ఈ సాంగ్ మహేష్ కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఇన్నేళ్ళలో మహేష్ ఇంత హై వోల్టేజ్ ఎనర్జీతో డ్యాన్స్ చేయలేదు. డ్యాన్స్ చేశారు కానీ గుంటూరు కారం సినిమాలో చేసినంత హై ఎనర్జీ అంత అయితే లేదు. ఈ విషయాన్ని మహేష్ బాబే వెల్లడించారు. రాజమౌళి సినిమాలో హీరో హైలైట్ అవ్వాలంటే విలన్ క్యారెక్టరైజేషన్ ఎంత ముఖ్యమో.. మహేష్ నుంచి డ్యాన్స్ విషయంలో ఆ హై ఎనర్జీని బయటకు తీయాలంటే శ్రీలీల లాంటి హీరోయిన్స్ కూడా అంతే ముఖ్యం. మళ్ళీ శ్రీలీలతో సినిమా చేస్తే తప్ప మహేష్ మళ్ళీ ఈ రేంజ్ లో డ్యాన్స్ వేయడం అనేది ఇంపాజిబుల్ అని.. శ్రీలీల వల్లే ఈ మ్యాజిక్ సాధ్యమైందని అన్నారు. దీన్ని బట్టి హై వోల్టేజ్ డ్యాన్స్ విషయంలో మహేష్ కి గుంటూరు కారం సినిమానే ఆఖరి సినిమా అని ఒప్పుకోక తప్పదు. మళ్ళీ శ్రీలీలతో చేస్తేనో.. లేదా డ్యాన్స్ లో శ్రీలీలని మించిన హీరోయిన్ వస్తేనో తప్ప మహేష్ నుంచి డ్యాన్స్ విషయంలో ఈ ఊర మాస్ ఎనర్జీని చూడలేము. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.