ఇటీవల సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుండెపోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల వంటి కారణాలతో పలువురు ప్రముఖులు మృతి చెందారు. ఇలా ప్రముఖల మృతితో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు కూడా విషాదంలో మునిగిపోతుంటారు. ఇటీవలే పఠాన్ చెరువు ఎమ్మెల్యే కుమారుడు అనారోగ్యం కారణంతో మృతి చెందాడు. ఇలా బాలీవుడ్ లో సైతం విషాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రముఖ సింగర్ అకస్మాత్తుగా మృతి చెందారు. హర్యానాకు చెందిన రాజు పంజాబీ(40) అనే స్టార్ సింగర్ కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని వైద్యులు ఎంత ప్రయత్నించిన కాపాడలేక పోయారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
మంగళవారం తెల్లవారు జామున హర్యానీ సింగర్ రాజు పంజాబీ మృతి చెందారు. గత కొన్నాళ్లుగా జాండీస్ తో అతడు బాధపడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోగా ఆరోగ్యం మెరుగుపడిందని డిశ్చార్జ్ చేశారు. కానీ మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. చనిపోవడానికి 9 రోజుల ముందే తాను పాడిన ఓ పాటని రిలీజ్ చేశాడు. ఆ పాటకు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతలోనే రాజు విగతజీవిగా మారి.. అభిమానులకు విషాదం మిగిల్చారు. హర్యాను చెందిన రాజు పంజాబీ పలు ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు.
అలానే పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా పాడారు. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఆయన అంత్యక్రియాలు స్వగ్రామమైన రావత్సర్ లో జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో అభిమానలు శోక సంధ్రంలో మునిగిపోయారు. కొన్ని రోజుల క్రితం వరకు స్టేజ్ షోలతో అలరించిన రాజు.. ఇలా విగత జీవిగా మారడాన్ని వారు జీర్ణించుకోలేపోతున్నారు. రాజు మృతిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలియజేశారు. మరి.. రాజు పంజాబీ మృతిపై సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: వైష్ణవి సెలబ్రేషన్ వీడియో రిలీజ్! అదరగొట్టేసింది!