డార్లింగ్ ప్రభాస్ డేరింగ్ డెసిషన్.. దర్శక, నిర్మాతలకు స్ట్రిక్ట్ రూల్స్

యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ప్రామిస్ చేశాడు ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలతో ఆకట్టుకుంటానని. ఈ నేపథ్యంలో ప్రభాస్ డేరింగ్ డేసిషన్ తీసుకున్నాడు. దర్శక, నిర్మాతలకు స్ట్రిక్ రూల్స్ పాస్ చేశాడు. ఇంతకు ఏం రూల్స్ అనుకుంటున్నారా...?

యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ప్రామిస్ చేశాడు ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలతో ఆకట్టుకుంటానని. ఈ నేపథ్యంలో ప్రభాస్ డేరింగ్ డేసిషన్ తీసుకున్నాడు. దర్శక, నిర్మాతలకు స్ట్రిక్ రూల్స్ పాస్ చేశాడు. ఇంతకు ఏం రూల్స్ అనుకుంటున్నారా...?

తెలుగు ఇండస్ట్రీ సత్తా గ్లోబల్ స్థాయికి చేరింది. స్టార్ హీరోల మార్కెట్ అమాంతం పెరిగింది. బాక్సాఫీసు కలెక్షన్లకు తగ్గట్లుగా బడ్జెట్ ఉంటోంది. ఒకప్పుడు 100 కోట్లతో మూవీ అంటే.. వామ్మో అనుకునేవారంతా. కానీ ఇప్పుడు మినిమం 300 కోట్లు.. మ్యాక్సిమ్ ఎంతైనా పెట్టేందుకు రెడీ అంటున్నారు నిర్మాతలు. పాన్ ఇండియన్ చిత్రాలు చేసి.. కాసుల సునామీ సృష్టిస్తున్నారు అగ్ర హీరోలు. సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. కేవలం టైర్ 1 హీరోలే కాదు.. టైర్ 2 యాక్టర్స్ సైతం పాన్ ఇండియా మూవీలపై ఫోకస్ పెంచుతున్నారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియన్ చిత్రాలు హీరోలకు అవరోధాలుగా మారాయి. ఒకప్పుడు ప్రతి హీరో నుండి ఒకటి లేదా రెండు సినిమాలు వచ్చేసేవి. కానీ ఇప్పుడు ఒక్కటి రావడం కూడా కష్టంగా మారింది. పాన్ ఇండియన్ లెవల్లో సినిమా తెరకెక్కించడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్.. ఓ డెసిషన్ తీసుకున్నాడట. అలాగే దర్శక నిర్మాతలకు, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు యంగ్ రెబల్ స్టార్ పెట్టిన ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే..?

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ చిత్రం తెరకెక్కాలంటే మినిమం వన్ ఇయర్ పడుతుంది. అప్పటికి కంప్లీట్ అవుతుందని చెప్పలేం. సినిమా తెరకెక్కించడం ఓ పనైతే.. వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషన్ల కోసం టైమ్ టేకింగ్ కావాల్సిందే. అప్పుడు కంప్లీట్ మూవీ ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. దీనికి సుమారు ఏడాదిన్నర నుండి రెండేళ్లు పడుతుంది. ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. బాహుబలి 2 విషయంలో ఇదే జరిగింది. 2016లో విడుదలవ్వాల్సిన సినిమా 2017లో వచ్చింది. రిజల్ట్, పేరు వచ్చినా.. ఐదేళ్లలో కేవలం ప్రభాస్ చేసింది రెండు సినిమాలు మాత్రమే. ఆ సమయంలో మిగిలిన హీరోలు మూడు, నాలుగు సినిమాలతో ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా చిత్రాల విషయంలో ఇలా పరంపర.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు.. మొన్నీ మధ్య వచ్చిన దేవర విషయంలోనూ ఇదే జరిగింది. పుష్ప 2, గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా ఎక్కువ టైం తీసుకున్నాయి. సినిమా రావడానికి రెండు మూడేళ్ల గ్యాప్ పట్టేస్తుంది. హీరోల కెరీర్ విషయానికి ఢోకా లేదు కానీ.. సినిమా సంఖ్య తగ్గిపోతుంది. ఇదే సమయంలో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌తో ర్యాపో పోతుంది. ఇదే డార్లింగ్‌కు తలనొప్పిగా మారింది.

ఏడాదికి రెండు సినిమాలతో ఆకట్టుకుంటానని అభిమానులకు ప్రామిస్ చేశాడు యంగ్ రెబల్ స్టార్. అందుకు తగ్గట్లుగా చేతి నిండా సినిమాలతో, షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్‌తో సినిమా అంటే షూటింగ్‌కే ఏడాది పట్టేస్తుంది. స్టార్ కాస్ట్.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషన్లకు మరింత టైమ్ పడుతుంది. ఏడాదికి ఓ సినిమా రావడం కష్టంగా మారింది. దీంతో డార్లింగ్ సెన్సేషనల్ డెసిషన్ ఫిక్స్ అయ్యాడు. ఇకపై షూటింగ్ 90 రోజుల్లోనే కంప్లీట్ అయ్యేలా చూడాలని దర్శక, నిర్మాతలకు చెబుతున్నాడు. అలాగే షూటింగ్ కంప్లీట్ అయిన.. ఆరు నెలల్లోగానే పూర్తయ్యేలా చూడాలని కండిషన్ పెడుతున్నట్లు టాక్. అప్పుడే ఏడాదికి రెండు సినిమాలు చేయగలనని భావిస్తున్నాడట ఈ బాక్సాఫీస్ కింగ్. అందుకే స్ట్రిక్ రూల్స్ ఫాలో అవ్వాలంటున్నాడట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఆ తర్వాత సినిమాలకు వీటిని ఫాలో అవ్వనున్నాడు. ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 చిత్రాలను 90 రోజుల్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట ప్రభాస్. మరీ కండిషన్లు ఓకే కానీ.. ఇది సాధ్యమయ్యే పనా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.  మీరేమంటారో అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments