10th పాసయ్యారా? కానిస్టేబుల్ జాబ్ పొందే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. పదో తరగతి పాసైతే చాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 69 వేల వరకు జీతం పొందొచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. పదో తరగతి పాసైతే చాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 69 వేల వరకు జీతం పొందొచ్చు.

పోలీస్ ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేసే పోలీస్ ఉద్యోగాలను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. మరి మీకు కూడా పోలీస్ ఉద్యోగాలంటే ఇష్టమా? పోలీస్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. కేవలం పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ జాబ్స్ ను పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 69 వేల వరకు జీతం అందిస్తారు. ఇటీవల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రూప్ బీ,సీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 34 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

బీఎస్ఎఫ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. గ్రూప్ బీ, సీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా/ డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్‌/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

  • 34.

విభాగాల వారీగా ఖాళీలు:

ఎస్సై (వెహికల్ మెకానిక్):

  • 03

అర్హత:

  • గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా/డిగ్రీ (ఆటో మొబైల్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ ఉండాలి.

వయోపరిమితి:

  • 30 సంవత్సరాలు మించకూడదు.

జీతం:

  • నెలకు రూ.35,400-1,12,400 అందిస్తారు.

కానిస్టేబుల్ (ఓటీఆర్‌పీ):

  • 01

కానిస్టేబుల్ (ఎస్‌కేటీ):

  • 01

కానిస్టేబుల్ (ఫిట్టర్):

  • 04

కానిస్టేబుల్ (కార్పెంటర్):

  • 02

కానిస్టేబుల్ (ఏఈ):

  • 01

కానిస్టేబుల్ (వెహికిల్‌ మెకానిక్‌):

  • 22

కానిస్టేబుల్ (బీఎస్‌టీఎస్‌):

  • 02

కానిస్టేబుల్ (అప్‌హోల్‌స్టర్‌):

  • 01

అర్హత:

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.21,700-69,100.

దరఖాస్తు ఫీజు:

  • గ్రూప్-బీకి రూ.200 చెల్లించాలి. గ్రూప్-సీ పోస్టులకు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్‌/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 17-06-2024
Show comments