SRH vs MI: ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో చూడండి..

ఉప్పల్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఈ ఒక్క మ్యాచ్ లోనే ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు నమోదు అయ్యాయి.

ఉప్పల్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఈ ఒక్క మ్యాచ్ లోనే ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు నమోదు అయ్యాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అసలు మ్యాచ్ మజా ఏంటో తెలుస్తోంది. ఇన్నాళ్లు చూడని ఎంతో ఆసక్తికర, ఉత్కంఠభరిత మ్యాచులు ఈ సీజన్ లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం జరిగిన మ్యాచ్ నభూతే- నభవిష్యతి అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు బ్యాటింగ్ లైనప్ లేదు అని వెటకారం చేసే వారికి కూడా ఇది సరైన సమాధానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సన్ రైజర్స్ అంటే బౌలింగ్ మాత్రమే.. బ్యాటింగ్ అంటే వారి వల్ల కాదు అనే ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం అంటున్నారు. మరి.. ఇంత గొప్ప మ్యాచ్ లో అసలు ఎన్ని రికార్డులు క్రియేట్ చేశారో చూద్దాం.

ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ హిస్టరీలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఏ క్రికెట్ అభిమాని చూడని టీ20 మ్యాచ్ ను హైదరాబాద్- ముంబయి జట్లు అందించాయి. ఒక్క మ్యాచ్ లో ఒక విధ్వంసాన్నే చూపించారు. హైదరాబాద్ జట్టే అనుకుంటే అటు ముంబయి జట్టు కూడా చెలరేగి ఆడారు. అయితే అభిమానులు అందరూ అసలు ఈ మ్యాచ్ లో ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మొత్తం ఈ మ్యాచ్ లో చాలానే రికార్డులు బద్దలు కొట్టారు. ముఖ్యంగా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక పరుగులు నమోదు అయ్యాయి. ఇరు జట్లు కలిపి ఏకంగా 523 పరుగులు చేశారు.

నలుగురు బ్యాటర్లు వేగంగా అర్ధ శతకాలు నమోదు చేశారు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో, ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో, 23 క్లాసెన్, 24 బంతుల్లో తిలక్ వర్మ అర్ధ శతకాలు నమోదు చేశారు. మరో రికార్డు చూస్తే ఐపీఎల్ హిస్టరీలో హైదరాబాద్ జట్టు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. గతంలో ఆర్సీబీ పేరిట ఉన్న 263/5 పరుగుల రికార్డును 277/3 పరుగులతో హైదరాబాద్ జట్టు బద్దలు కొట్టింది. అలాగే ముంబయి జట్టు కూడా స్కోర్ విషయంలో కొత్తి రికార్డు నెలకొల్పింది. ఛేజింగ్ చేస్తున్నప్పుడు అత్యధిక స్కోర్(246/5) నమోదు చేసిన జట్టుగా ముంబయి రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు అత్యధిక సిక్సులు(20) నమోదు బాదింది. మరోవైపు హైదరాబాద్ జట్టు 18 సిక్సులు కొట్టింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 69 బౌండిరీలు నమోదు అయ్యాయి.

అలాగే ఒక టీ20 మ్యాచ్ లో అత్యధిక సిక్సులు కూడా ఈ మ్యాచ్ లోనే నమోదు అయ్యాయి. అలాగే డెబ్యూడెంట్ క్వేనా మఫాకా తన పేరిట ఒక చెత్త రికార్డును నెలకొల్పాడు. ఒక ఐపీఎల్ డెబ్యూ బౌలర్ గా అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డును మఫాకా పేరిట నమోదు చేశాడు. అతను వేసిన 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 66 పరుగులు ఇచ్చాడు. ఇలా ఈ మ్యాచ్ మొత్తంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశారు. అలాగే అభిమానులకు అసలై టీ20 మజాని అందించారు. మరి.. సన్ రైజర్స్ హైదరాబాద్– ముంబయి ఇండియన్స్ మ్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments