Nidhan
రికార్డులు సృష్టించాలన్నా మేమే, ఆ రికార్డులను తిరగరాయాలన్నా మేమే అనే రీతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగి ఆడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పాత రికార్డుల దుమ్ముదులుపుతోంది ఆరెంజ్ ఆర్మీ.
రికార్డులు సృష్టించాలన్నా మేమే, ఆ రికార్డులను తిరగరాయాలన్నా మేమే అనే రీతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగి ఆడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పాత రికార్డుల దుమ్ముదులుపుతోంది ఆరెంజ్ ఆర్మీ.
Nidhan
రికార్డులు సృష్టించాలన్నా మేమే, ఆ రికార్డులను తిరగరాయాలన్నా మేమే అనే రీతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగి ఆడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పాత రికార్డుల దుమ్ముదులుపుతోంది ఆరెంజ్ ఆర్మీ. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ టీమ్‌కూ సాధ్యం కాని రీతిలో ఓ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ముగిసేసరికి 158 పరుగులు చేసింది. తద్వారా పది ఓవర్లలో హయ్యెస్ట్ టోటల్ నమోదు చేసిన టీమ్‌గా సన్‌రైజర్స్ రికార్డు సృష్టించింది. ఇదే మ్యాచ్‌లో మరో రికార్డును కూడా బ్రేక్ చేసింది ఆరెంజ్ ఆర్మీ.
పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది కమిన్స్ సేన. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది సన్‌రైజర్స్. టీ20 క్రికెట్లో ఇప్పటిదాకా పవర్‌ప్లేలో ఏ టీమ్ కూడా ఇంత భారీ స్కోరు చేయలేదు. దీనంతటికీ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (32 బంతుల్లో 89), అభిషేక్ శర్మ (12 బంతుల్లో 46)కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ స్కోరు 17.3 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 228. ఓవర్లన్నీ ముగిసేసరికి టీమ్ 250 పరుగులు చేయడం కన్ఫర్మ్గా కనిపిస్తోంది. మరి.. ఎస్ఆర్హెచ్ రికార్డులపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
SRH REGISTERED THE HIGHEST TOTAL IN IPL HISTORY AFTER THE FIRST 10 OVERS. pic.twitter.com/31CWNPXkrV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2024