Gautam Gambhir: ఎప్పుడూ కోపంగా ఉండే గంభీర్ తొలిసారి నవ్వాడు! కారణం ఏంటంటే?

టీమిండియా లెజెండరీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎప్పుడూ సీరియస్​గా కనిపిస్తాడు. అది మ్యాచ్ అయినా బయట ప్రెస్ మీట్ అయినా లేదా పొలిటికల్ మీటింగ్ అయినా సరే.. అతడు సీరియస్​ లుక్​లో ఉంటూ అలాగే మాట్లాడతాడు కూడా. అయితే ఫస్ట్ టైమ్ గౌతీ స్మైల్ ఇచ్చాడు.

టీమిండియా లెజెండరీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎప్పుడూ సీరియస్​గా కనిపిస్తాడు. అది మ్యాచ్ అయినా బయట ప్రెస్ మీట్ అయినా లేదా పొలిటికల్ మీటింగ్ అయినా సరే.. అతడు సీరియస్​ లుక్​లో ఉంటూ అలాగే మాట్లాడతాడు కూడా. అయితే ఫస్ట్ టైమ్ గౌతీ స్మైల్ ఇచ్చాడు.

క్రికెటర్స్​లో చాలా మంది జోవియల్​గా, ఫన్నీగా ఉంటారు. విరాట్ కోహ్లీ లాంటి కొందరు ఆటగాళ్లైతే అందరితో ఇట్టే కలసిపోతారు. గ్రౌండ్​లో లేదా బయట ఎక్కడైనా సరే కింగ్ ఉంటే అక్కడ ఎంటర్​టైన్​మెంట్ పక్కా అనే చెప్పాలి. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అలాగే బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ ఇతర ప్లేయర్లను సరదాగా ఆటపట్టించడం విరాట్​కు అలవాటు. కోహ్లీ, వార్నర్ లాంటి పేరుమోసిన క్రికెటర్లు ప్రేక్షకులతో కలసి డ్యాన్సులు చేయడం కూడా చూస్తుంటాం. అయితే అందరూ ఒకేలా ఉండరు. కొందరు తమ మైండ్​లో ఏం నడుస్తుందో బయట ఎక్స్​ప్రెషన్స్ రూపంలో​ చూపించడానికి ఇష్టపడరు. ఎప్పుడూ సీరియస్​గా ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భారత లెజెండ్ గౌతం గంభీర్. ఎప్పుడు చూసినా గౌతీ ఒకేలా ఉంటాడు. అలాంటోడు ఫస్ట్ టైమ్ నవ్వాడు.

గంభీర్ ఎప్పుడూ సీరియస్​గానే కనిపిస్తాడు. అది మ్యాచ్ అయినా బయట ప్రెస్ మీట్ అయినా లేదా పొలిటికల్ మీటింగ్ అయినా సరే.. అతడు సీరియస్​ లుక్​లో ఉంటూ అలాగే మాట్లాడతాడు కూడా. దీంతో గంభీర్ అంటే సీరియస్​ అనేది అందరికీ అలవాటైపోయింది. కానీ తొలిసారి అతడు స్మైల్ ఇచ్చాడు. లక్నో సూపర్ జియాంట్స్​కు కోల్​కతా నైట్ రైడర్స్​కు మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్​కు అటెండ్ అయ్యాడు గంభీర్. కేకేఆర్​కు మెంటార్​గా ఉన్న ఈ దిగ్గజం ప్రెస్​ కాన్ఫరెన్స్​కు వచ్చిన రిపోర్టర్లకు రసగుల్లాలు పంచాడు. బెంగాలీలు ఎంతో ఘనంగా జరుపుకునే సంవత్సరాది పోలియా బైసాఖ్ పండుగ సందర్భంగా జర్నలిస్టులకు స్వీట్లతో నోరు తీపి చేశాడు గౌతీ. ఆ టైమ్​లో నవ్వులు చిందించాడతను.

రిపోర్టర్లకు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసిన గంభీర్.. స్వీట్లు తిని అందరూ క్యాలరీలు పెంచుకోవాలని జోక్ వేశాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. గౌతీ కూడా స్మైల్ ఇచ్చాడు. ఎప్పుడూ సీరియస్​గా కనిపించే గంభీర్.. తొలిసారి నవ్వడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అతడిలో కనిపించని యాంగిల్ చూసి షాకైనా.. మంచితనానికి ఫిదా అయ్యారు. ఇక, లక్నోతో జరిగిన మ్యాచ్​లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. 47 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్​గా నిలిచిన ఫిల్ సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్​లో రెండో స్థానానికి ఎగబాకింది కేకేఆర్. మరి.. ఎప్పుడూ సీరియస్​గా కనిపించే గంభీర్ నవ్వడం మీద మీ రియాక్షన్​ను కామెంట్ చేయండి.

Show comments