IPLతో BCCIకి కొత్త తలనొప్పి.. ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది!

ఐపీఎల్​తో పలు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని బీసీసీఐ భావించింది. కానీ క్యాష్ రిచ్ లీగ్ వల్ల బోర్డుకు కొత్త తలనొప్పి మొదలైంది.

ఐపీఎల్​తో పలు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని బీసీసీఐ భావించింది. కానీ క్యాష్ రిచ్ లీగ్ వల్ల బోర్డుకు కొత్త తలనొప్పి మొదలైంది.

ఐపీఎల్​తో పలు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని బీసీసీఐ భావించింది. కానీ క్యాష్ రిచ్ లీగ్ వల్ల బోర్డుకు కొత్త తలనొప్పి మొదలైంది. మెగా లీగ్ ముగిసిన కొన్ని రోజుల గ్యాప్​లోనే టీ20 వరల్డ్ కప్-2024 మొదలుకానుంది. ఈ టోర్నీలో ఆడే టీమ్ సెలక్షన్​కు ఎక్కువ టైమ్ లేదు. ఇప్పటికే సెలక్టర్లు భారత జట్టును ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఐపీఎల్ మ్యాచుల్ని దగ్గరుండి తీక్షణంగా గమనిస్తున్నారని వినికిడి. ఈ లీగ్​తో జట్టు ఎంపికకు సంబంధించిన చిక్కుముడులకు జవాబు దొరుకుతుందని బోర్డు భావించింది. కానీ ఆన్సర్ దొరక్కపోగా కొత్త తలనొప్పి మొదలైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వల్ల భారత క్రికెట్ బోర్డుకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 ప్రపంచ కప్​కు వెళ్లే టీమ్​కు సంబంధించి ఓపెనింగ్ నుంచి ఫినిషర్ వరకు, పేసర్ల నుంచి స్పిన్నర్ల దాకా అన్ని రోల్స్​ మీద సెలక్టర్లు ఓ అవగాహనతో ఉన్నారని తెలుస్తోంది. అయితే వికెట్ కీపింగే వాళ్లను ఇబ్బంది పెడుతోందట. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఐపీఎల్​తో ఫామ్, ఫిట్​నెస్ నిరూపించుకుంటే వికెట్ కీపర్​గా అతడ్నే వరల్డ్ కప్​కు పంపాలని సెలక్టర్లు అనుకున్నారట. అతడికి బ్యాకప్​గా జితేష్ శర్మను కూడా జట్టులో ఉంచాలని బావించారట. కానీ ఇప్పుడు ఆ రోల్​కు అనేక ఆప్షన్స్ తెరమీదకు వస్తున్నాయి. జితేష్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. పంత్ మాత్రం తన ఫామ్, ఫిట్​నెస్​ను ప్రూవ్ చేసుకున్నాడు. అటు సీనియర్ కీపర్ దినేష్ కార్తీక్ సంచలన ఇన్నింగ్స్​లతో సత్తా చాటుతున్నాడు.

ఇంజ్యురీ కారణంగా ఇంగ్లండ్ సిరీస్​కు దూరంగా ఉన్న స్టైలిష్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా ఐపీఎల్​తో సూపర్ టచ్​లోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా బ్యాట్​తో రెచ్చిపోతున్నాడు. కీపింగ్​లోనూ సత్తా చాటుతున్నాడు. అటు బోర్డు కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా మెరుపు ఇన్నింగ్స్​లతో తాను కూడా వికెట్ కీపర్ పొజిషన్​కు రేసులో ఉన్నానని అంటున్నాడు. ఇలా పంత్​-జితేష్​ జోడీని పంపిద్దామనుకున్న బోర్డు ముందు కీపింగ్ కోసం చాలా ప్రత్యామ్నాయాలు వచ్చి పడ్డాయి. పంత్​ను పంపడం ఫిక్స్ అని తెలుస్తోంది. కానీ అతడికి బ్యాకప్​గా రాహుల్, కార్తీక్, సంజూల్లో ఎవర్ని తీసుకోవాలనేది సెలక్టర్లకు అర్థం కావట్లేదట. ఐపీఎల్​తో కీపర్​పై క్లారిటీ వస్తుందనుకుంటే అదే పెద్ద చిక్కుముడి పొజిషన్​గా మారడంతో బోర్డు పెద్దలు కూడా తలలు పట్టుకుంటున్నారట. మరి.. టీ20 వరల్డ్ కప్​కు ఏ ప్లేయర్​ను కీపర్​గా తీసుకుంటే బెటరో కామెంట్ చేయండి.

Show comments