Sunita Williams Dance: వీడియో: అంతర్జాతీయ స్పేస్ సెంటర్ లో సునీత విలియమ్స్ డ్యాన్స్!

త సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కూడా మరో రికార్డు ను  సాధించారు. గురువారం సునీతా విలియమ్స్ ఇంటర్ నేషనల్  స్పేస్ సెంటర్ కి చేరుకున్నారు. అక్కడ ఆమె డ్యాన్స్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

త సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కూడా మరో రికార్డు ను  సాధించారు. గురువారం సునీతా విలియమ్స్ ఇంటర్ నేషనల్  స్పేస్ సెంటర్ కి చేరుకున్నారు. అక్కడ ఆమె డ్యాన్స్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అంతరిక్షానికి సంబంధించి ప్రయోగాలు చేస్తుంటాయి. ఇక భారత్ దేశం కూడా అంతరిక్ష ప్రయోగాల్లో అనేక విజయాలు సాధించింది. అంతేకాక భారత సంతతికి చెందిన వారు కూడా అనేక ఘనతలను సాధించారు. తాజాగా భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కూడా మరో రికార్డు ను  సాధించారు. గురువారం సునీతా విలియమ్స్ ఇంటర్ నేషనల్  స్పేస్ సెంటర్ కి చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు సైతం బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ద్వారా ప్రయాణించారు. అక్కడ చేరుకున్న అనంతంర సునీత విలియమ్స్ సంతోషంతో డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ.. పుర్తి వివరాల్లోకి వెళ్తే…

గురువారం భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వార అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం అయ్యారు. వీరు ప్రయాణించిన వ్యోమ నౌక గురువారం విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. అలా స్పేస్ సెంటర్ లోకి వచ్చిన వారిని గంటకొట్టి ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తుంది. అలానే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ప్రకారమే వ్యోమగాములను గంటకొట్టి వారిని ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలోనే ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న అనంతరం సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్‌ స్పేస్‌ తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. ఇక ఆ వీడియోను చూసినట్లు అయితే వ్యోమనౌకలో నుంచి వస్తున్నవారు..గాలిలో తేలిపోతున్నట్లు ఉన్నారు. ఐఎస్ఎస్ లో బరువు అనేది శున్యమవుతుంది. అక్కడ శున్యం అనేది ఆక్రమించే ఉండే సంగతి తెలిసిందే.

అలాంటి పరిస్థితుల్లో సునీత చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక సునీత విలియమ్స్ మాట్లాడుతూ.. ఐఎస్ఎస్ లో ఉన్న వారంతా తన కుటుంబం లాంటివారని, వారిని కలిసిన సందర్భంగా తాను ఆ విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నానని తెలిపారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి బోయింగ్ వ్యోమనౌకను ప్రయోగించారు. అలా ప్రయోగించిన 26 గంటల తర్వాత సునీత విలిమస్స్ ప్రయాణిస్తున్న ఈ బోయింగ్ వ్యోమనౌకను ఐఎస్ఎస్ కి విజయవంతంగా అనుసంధానం చేశారు.

బోయింగ్‌ అనే అంతరిక్ష  సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇదే తొలి మానవసహిత యాత్ర. గతంలో  హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్‌-కంట్రోల్‌ థ్రస్టర్లలో సమస్యలు తలెత్తాయి. ఆ కారణంతో గంట సమయం ఆలస్యమైంది. అయినప్పటికీ ఐఎస్ఎస్ తో ఈ వ్యొమనౌకతో అనుసంధానం కాగలిగింది. సునీతా విలియమ్స్‌ భారత సంతతికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. ఆమె ఇలా రోదసిలోకి వెళ్లడం మూడో సారి. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఆమె నడిచారు. గత అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Show comments