తెలుగు రాష్ట్రాల్లో జూన్ నుంచి థియేటర్స్ బంద్ !

గత కొద్దీ రోజులుగా థియేటర్స్ విషయంలో ఫిలిం ఛాంబర్ వర్గాల మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయో తెలియనిది కాదు. ఎట్టకేలకు ఈ చర్చలపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబందించిన విషయాలను చూసేద్దాం.

గత కొద్దీ రోజులుగా థియేటర్స్ విషయంలో ఫిలిం ఛాంబర్ వర్గాల మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయో తెలియనిది కాదు. ఎట్టకేలకు ఈ చర్చలపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబందించిన విషయాలను చూసేద్దాం.

ఇకనుంచి అటు ఏపి లో ఇటు తెలంగాణలో చాలా థియేటర్స్ ను రెంట్ విధానంలో కాకుండా.. పర్సెంటేజ్ విధానంలోనే నడిపించాలని.. కొంతమంది సినీ పెద్దలు, ఫిలిం ఛాంబర్ వర్గాలు తీవ్ర చర్చలు జరిపినట్టు.. కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ విషయంలో గత కొద్దిరోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ విషయంలో ఓ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది

తాజాగా ,మే 18న ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల మద్య సమావేశం జరిగింది. కొంతమంది ముఖ్యమైన నిర్మాతలు ఈ సమావేశానికి హాజరు కాలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సమావేశంలో వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. అందులో భాగంగా జూన్ 1 నుంచి సింగల్ స్క్రీన్ థియేటర్స్ ను నిలిపివేయాలనే  నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటీసులు ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్స్ కు అందనున్నాయట. దీనిలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ ఎఫెక్ట్ రిలీజ్ కు రెడీగా ఉన్న రెండు పెద్ద సినిమాల మీద పడుతుందని చెప్పొచ్చు. వీటిలో ఒకటి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు.. మరొకటి కమల్ హాసన్ థ‌గ్ లైఫ్. అయితే ఇంకా బంద్ ఫైనల్ కాలేదు. కాబట్టి ఈలోగా మరోసారి చర్చలు జరిపి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments