Arjun Suravaram
వంతెనలు కూలిపోయిన ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. రెండు రోజుల క్రితం బీహర్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలిపోయింది. తాజాగా ఓడ ఢీ కొట్టడంతో నదిపై ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు నీటిలో...
వంతెనలు కూలిపోయిన ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. రెండు రోజుల క్రితం బీహర్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలిపోయింది. తాజాగా ఓడ ఢీ కొట్టడంతో నదిపై ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు నీటిలో...
Arjun Suravaram
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలను చూసినప్పుడు షాక్ కి గురవుతుంటాము. బ్రిడ్జీలు కూలిపోవడం, వంతెనలు తెగిపోవడం, బస్సులు లోయలో పడిపోవడం వంటి ఘోరమైన ప్రమాదాలను మనం చూస్తుంటారు. ఇటీవలే బీహర్ లోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా అమెరికాలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఓడ ఢీ కొట్టడంతో బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అమెరికాలో ఓ నదిపై నిర్మించిన వంతెన కుప్పకూలింది. నదిలో నుంచి వెళ్లిన ఓడ ఆ బ్రిడ్జిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వంతెన కాసేపటికే పేక మేడాల కుప్పకూలింది. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్ ప్రాంతంలో ఈ వంతెన ఉంది. ఫ్రాన్సిస్ స్కాట్ ప్రాంతంలోని పటాపస్కో నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి 2.6 కిలో మీటర్ల పొడవు ఉంది. మంగళవారం తెల్లవారుజామున ఈ బ్రిడ్జిని ఒక భారీ కంటైనర్ ఓడ ఢీకొట్టింది. వంతెనకు ఓ భాగంలో బలంగా ఓడ ఢీకొట్టింది దాంతో..బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు నీటిలో పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
సింగపూర్ జెండాతో ఆ నౌక ప్రయాణిస్తున్నట్లు స్థానికులు కొందరు వెల్లడించారు. బాల్టిమోర్ నుంచి శ్రీలంక లోని కొలంబోకు ఆ నౌక వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నౌకకు దాలి అనే పేరు ఉన్నట్లు తెలిసింది. ఇక వంతెన కూలిపోవడం వల్ల బాల్టిమోర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రభావితమయ్యినట్లు తెలుస్తోంది. మేరీల్యాండ్ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పోర్ట్ ద్వారా వ్యవసాయ, నిర్మాణ యంత్రాలు, చక్కెర, జిప్సం, బొగ్గును సరఫరా జరుగుతుంది. బాల్టిమోర్ మేయర్ బ్రాండన్ స్కూట్ మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక ఈ వంతెనను అమెరికన్ న్యాయవాది, రచయిత , కవి అయిన ఫ్రాన్సిస్ స్కాట్ కీ పేరు మీదుగా 1977లో నిర్మించారు. ప్రస్తుతం దీని నిర్మాణానికి 60.3 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తంగా ఓడ ఢీకొనడంతో బ్రిడ్జి కుప్పకూలిపోయిన వంతెనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.
షాకింగ్ విజువల్స్
అమెరికా – బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓడ ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి. pic.twitter.com/1OYjo3Fdqx
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2024