ఇకపై కేవలం 2 నిమిషాల్లోనే PF డబ్బులు విత్‌డ్రా.. ఎలా అంటే..

పీఎఫ్‌ డబ్బులు డ్రా చేయాలంటే.. కొన్ని రోజుల సమయం పడుతుంది. ఇకపై మీరు రెండు నిమిషాల్లో పీఎఫ్‌ డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఎలాగో తెలియాలంటే.. ఇది చదవండి

పీఎఫ్‌ డబ్బులు డ్రా చేయాలంటే.. కొన్ని రోజుల సమయం పడుతుంది. ఇకపై మీరు రెండు నిమిషాల్లో పీఎఫ్‌ డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఎలాగో తెలియాలంటే.. ఇది చదవండి

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి సాలరీ అకౌంట్‌తో పాటు కచ్చితంగా ఉండే మరో ఖాతా ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) అకౌంట్‌. ఉద్యోగి భవిష్యత్తు అవసరాలు, రిటైర్మెంట్‌ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని.. జీతం నుంచే కొంత మొత్తాన్ని కట్‌ చేసి.. పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. పీఎఫ్‌ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, కొన్ని ప్రైవేటు కంపెనీలు సగ భాగాన్ని వారు భరిస్తే.. మిగతా మొత్తాన్ని ఉద్యోగి జీతం నుంచి కట్‌ చేస్తారు. కొన్ని చోట్ల రెండు భాగాలు ఉద్యోగి జీతం నుంచే కట్‌ చేస్తారు. పీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తం మీద ప్రభుత్వం ఇంట్రెస్ట్‌ కూడా ఇస్తుంది. పీఎఫ్‌ ఖాతాలో ఉన్న డబ్బుని డ్రా చేయకుండా అలానే ఉంచితే.. ఉద్యోగి రిటైర్మెంట్‌ తర్వాత భారీ మొత్తంలో చేతికి వస్తుంది.

అయతే చాలా సందర్భాల్లో ఉద్యోగులు తమ అవసరాల నిమిత్తం పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌ డ్రా చేస్తుంటారు. ఈ మొత్తం మన ఖాతాలో పడాలంటే.. కాస్త సమయం పడుతుంది. పీఎఫ్‌ వెబ్‌సైట్‌ ఒపెన్‌ చేసి డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా.. మొబైల్‌ నుంచే నిమిషాల వ్యవధిలోనే పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌ డ్రా చేసుకోవచ్చు. దీని కోసం ఒక యాప్‌ కూడా అందుబాటులో ఉంది. అదే ఈపీఎఫ్ఓ యాప్ ఉమాంగ్. దీని ద్వారా కూడా ఈపీఎఫ్‌ సేవలు పొందవచ్చు. ఈ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ ఖాతాలో డబ్బు ఎంత ఉందో కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతే కాదండోయ్‌.. దీని నుంచి కూడా మీ పీఎప్ ఖాతాలో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. మీ మొబైల్ నుంచే డైరెక్ట్ గా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఎలా డ్రా  చేయాలంటే..

  • ఉమాంగ్‌ యాప్‌లో ఈపీఎఫ్‌ సేవలను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
  • ముందుగా మీరు మీ మొబైల్‌లో ఉమాంగ్‌ ఓపెన్‌ చేయాలి.
  • ఆ తర్వాత సెర్చ్‌ మెనుకి వెళ్లి ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • అక్కడ ఎంప్లాయి సెంట్రిక్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • తర్వాత రెజ్‌ క్లెయిమ్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత ఈపీఎఫ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
  • అప్పుడు రిజిస్టర్‌ ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయాలి.
  • ఆ తర్వాత మీరు విత్‌ డ్రా ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.
  • తర్వాత సబ్మిట్‌ మీద క్లిక్‌ చేయాలి.

ఈ ప్రాసెస్‌ పూర్తయితే మీ విత్‌డ్రా ప్రాసెస్‌ అయిపోయినట్లు. ఈ ప్రాసెంస్‌లో భాగంగా మీ క్లెయిమ్‌కు సంబంధించిన రిఫరెన్స్‌ నంబర్‌ కూడా వస్తుంది. దీని ద్వారార మీరు క్లెయిమ్‌ స్టేటస్‌ను కూడా ట్రాక్‌ చేసుకోవచ్చు.

Show comments