CM జగన్ పై దాడి.. స్పందించిన మోదీ, KTR, ప్రముఖులు

Attack On CM YS Jagan: సీఎం జగన్ పై జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేటీఆర్ స్పందించారు. ఆ వివరాలు..

Attack On CM YS Jagan: సీఎం జగన్ పై జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేటీఆర్ స్పందించారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు బస్సు యాత్ర విజయవాడ సింగ్ నగర్ చేరుకున్న వేళ జగన్ మీద రాయితో దాడి చేశారు. ప్రజలకు అభివాదం చేస్తోన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ సంఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి గాయమైంది.

దాడి సమయంలో జగన్ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయమైనట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత జగన్ బస్సులోనే ప్రాథమిక చికిత్స తీసుకున్నారు. అనంతరం బస్సుయాత్రను యధావిథిగా కొనసాగించారు. ఇక ఈ సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేటీఆర్, ఇతర ప్రముఖులు స్పందించారు. ఆవివరాలు..

సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడిపై ప్రధాన రేంద్ర మోదీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా మెసేజ్ చేశారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అలానే ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. రాయి దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. జగన్ సురక్షితంగా బయటపడినందుకు సంతోషిస్తున్నాను అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు కేటీఆర్.. ’’మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్నా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను‘‘అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరగటం ఇప్పుడు రెండు రాష్ట్రాలను ఒక్కసారిగా కుదిపేసింది. దాడిపై జగన్ అభిమానులు, వైఎస్సార్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గాయం నేపథ్యంలో నేడు బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.

Show comments