రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతులేని భారీ అవినీతి జరిగిందని, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని ఏటియం మాదిరి వాడుకున్నారు అని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోడి చెప్పిన విషయం తెలిసిందే. గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో పోలవరం ప్రాక్టుని సకాలంలో పూర్తి చేయాలనే ఆలోచనతో కాకుండా అందినకాడికి దోచుకుందామ అనే పంథాలో, చేసిన పనుల వలన అంతులేని నిర్లక్ష్యానికి గురైంది. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పనుల్లో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించింది.
ఇదిలా ఉండగా తెలుగుదేశానికి వంత పాడే ఒక వర్గ మీడియా తన నాయకుడిని కాపాడుకునే ధోరణిలో ప్రజలను పక్కదారి పట్టించే విధంగా కేంద్రప్రభుత్వం పోలవరంలో అవినీతి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసిందని , జనసేన నేత పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు బదులిస్తు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ వాఖ్యలు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదని, ఇదే విషయం కేంద్రం చెబితే అవినీతి జరగలేదని ప్రచారం చేసుకుంటున్నారు అని, విజిలెన్స్ నివేదిక రాకముందే అవినీతి జరగలేదని క్లీన్ చిట్ ఎలా తెలుగుదేశం నేతలు ఇచ్చుకుంటారు అని, పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల రూపాయలు ఆదా చేశామని అలాగే పోలవరంలో లో అవకతవకలు జరిగాయని గతంలోనే కాగ్ రిపోర్టు ఇచ్చిందని , పోలవరంలో 20శాతం పనులు పూర్తి చేసి, 70 శాతం చేశామని టీడీపీ అబద్దాలు చెప్పుకుంటోందని మండిపడ్డారు.
పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ అండ్ ఎంఫోర్స్మెంట్ విభాగం హెడ్ వర్క్, కుడి ఎడమ కాలవ పనుల్లో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చేందుకు ఇప్పటికే మూడు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అంతకముందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటి పొలవరం పనుల్లో 5ఏళ్లలో 3,128.31 కోట్ల మేర అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చింది. దీంతో పాటు కాగ్ రిపొర్టు, రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేసిన 800 కోట్లు తెలుగుదేశం హయాంలో జరిగిన అవినీతిని బహిర్గతం చెస్తుంటే. పొలవరంలో అవినీతి జరగలేదు అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపిందని ప్రచారం చేయడం దానికి ఒక వర్గ మీడియా వంత పాడటం చూస్తే తెలుగుదేశం అధినేతను రక్షించుకునేందుకు పడుతున్న తంటాలుగా కనపడుతుంది.