• Home
  • తాజా వార్తలు
  • రాజకీయ వార్తలు
  • సినిమా వార్తలు
  • Nostalgia
  • ఫోటో గ్యాలరీ
  • రివ్యూస్
  • వీడియోలు
  • ID Exclusive
    • రాజకీయ వార్తలు
    • సినిమా వార్తలు
    • ఫోటోలు
    • రివ్యూస్
    • నోస్టాల్జియా
    • వీడియోలు
    • పోల్స్
    • స్పాట్ లైట్
    • బాక్స్ ఆఫీసు పోర్టల్
    • ట్రెండింగ్ వార్తలు
    • పాపులర్ న్యూస్
    • ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు
    • USA షో టైమ్స్
    Home » News » శశికళను వెంటాడుతోన్న దురదృష్టం..!!

    శశికళను వెంటాడుతోన్న దురదృష్టం..!!

    • By Karthik P Published Date - 06:57 AM, Fri - 22 January 21 IST
    శశికళను వెంటాడుతోన్న దురదృష్టం..!!

    తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళను దురదృష్టం వెంటాడుతోంది. జయలలిత మరణం తర్వాత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ.. ఈ నెల 27వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఈ లోపే ఆమె కరోనా బారినపడ్డారు. బెంగుళూరులోని జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, వెన్ను నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. చికిత్స కోసం ఆమెను బెంగూళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

    తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత వరుసగా రెండోసారి ఎన్నికైన తర్వాత ఏడాదికే ఆమె ఆనారోగ్యంతో మరణించారు. అన్నాడీఎంకేకు కర్త, కర్మ, క్రియ అయిన జయలలిత తర్వాత.. ఆ పార్టీలో, ప్రభుత్వంలో చీలికలు వచ్చాయి. పన్నీర్‌ సెల్వం, పళణి స్వామి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు శశికళ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం కూడా అధిరోహిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈలోపే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జయ మరణం తర్వాత అక్రమాస్తుల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. శశికళ జైలుపాలయ్యారు.

    ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందే శశికళ జైలు నుంచి విడుదల కాబోతుండడంతో.. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారతాయని అందరూ అంచనా వేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే బలీయంగా ఉండగా.. అన్నాడీఎంకేలో నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఈ పరిణామాలను శశికళ తనకు అనుకూలంగా మలుచుకుని ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు నడిచాయి. మరో వారం రోజుల్లో జైలు నుంచి విడుదలవుతారనగా.. శశికళ కరోనా బారినపడడం ఆమె అభిమానుల్లో నిరాశను నింపింది. పైగా.. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఆరోగ్యం విషమించిందని వైద్యులు చెప్పడంతో శశికళ వర్గం ఆందోళనలో ఉంది.

    Read Also : కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తున్న అన్నదాత ఐక్యత..!

    Tags  

    • Corona Positive
    • Covid-19
    • Sasikala
    • Tamil Nadu Politics

    Related News

    Covid-19 booster dose ఆరునెల‌ల‌కే బూస్ట‌ర్ డోసు

    Covid-19 booster dose ఆరునెల‌ల‌కే బూస్ట‌ర్ డోసు

    దేశవ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా కేసుల‌ను అడ్డుకోవ‌డానికి కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెండు డోజుల వ్యాక్సిన్ త‌ర్వాత బూస్ట్ డోసుల త‌ర్వాత వేసుకొనే బూస్ట‌ర్ డోసు వ్య‌వ‌ధిని 6నెల‌ల‌కు త‌గ్గించాల‌ని నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేష‌న్ ( NTAGI ) స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (STSC) గత నెలలో సిఫార్సు చేసిన త‌ర్వాత ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అంటే, రెండో డోజు తీసుకొని 6నెల‌లు పూర్త‌యిన వారికి బూస్ట‌ర్ డోసు అందించ‌నున్నారు. అందువల్ల, 18-59 […]

    11 months ago
    విమానాశ్రయంలో సంస్కృత ఎనౌన్స్ మెంట్లు  – ఎక్కడంటే?

    విమానాశ్రయంలో సంస్కృత ఎనౌన్స్ మెంట్లు – ఎక్కడంటే?

    12 months ago
    ఆన్ లైన్ లో స్విమ్మింగ్ టెస్ట్ – ట్రోల్ కంటెంట్ గా మారిన చైనా యూనివర్సిటీ 

    ఆన్ లైన్ లో స్విమ్మింగ్ టెస్ట్ – ట్రోల్ కంటెంట్ గా మారిన చైనా యూనివర్సిటీ 

    12 months ago
    కరోనాపై ఊరటనిచ్చే వ్యాఖ్యలు.. నాలుగో వేవ్‌ వచ్చినా..

    కరోనాపై ఊరటనిచ్చే వ్యాఖ్యలు.. నాలుగో వేవ్‌ వచ్చినా..

    1 year ago
    కరోనాపై కేంద్రం హెచ్చరికలు.. నాలుగో వేవ్‌ ముప్పు తప్పదా..?

    కరోనాపై కేంద్రం హెచ్చరికలు.. నాలుగో వేవ్‌ ముప్పు తప్పదా..?

    1 year ago

    తాజా వార్తలు

    • Hastinarealty యాదాద్రి, షాద్ న‌గ‌ర్ , కడ్తాల్ టౌన్ ల్లో HMDA ఎప్రూవ్డ్ ల‌గ్జ‌రీ రెసిడెన్షియ‌ల్ ప్లాట్స్ , రియాల్టీలో హ‌స్తిన కొత్త ట్రెండ్
      4 months ago
    • ఏజెంట్ ఇన్ – భోళాశంకర్ డ్రాప్
      4 months ago
    • గీత గోవిందం 2 ప్లానింగ్ నిజమేనా?
      4 months ago
    • రూటు మార్చిన శర్వానంద్
      4 months ago
    • ప్రచారానికి చెక్ పెట్టిన సమంతా
      4 months ago
    • ఓటిటి హక్కులకే 80 కోట్లా?
      4 months ago
    • ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ స్థాయిలో దసరా ఉంటుందా?
      4 months ago

    సంఘటనలు వార్తలు

    • ఫిబ్రవరిలో మీడియం సినిమాల హంగామా
      4 months ago
    • ప‌వ‌న్ పిల్ల‌ల ఫీజులు క‌ట్టుకోలేరా?
      4 months ago
    • రామ్ చరణ్ సూర్య కాంబోలో మల్టీస్టారర్ ?
      4 months ago
    • షాకింగ్ పాత్రల్లో కాజల్ శ్రీలీల
      4 months ago
    • పఠాన్ విజయానికి 5 కారణాలు
      4 months ago
    • ఆన్ లైన్ గొడవలతో సాధించేది ఏముంది?
      4 months ago
    • బుట్టబొమ్మలో ప్రేమే కాదు సస్పెన్సూ ఉంది
      4 months ago

    News

    • Box Office
    • Movies
    • Events
    • Food
    • Popular Social Media
    • Sports

    News

    • Reviews
    • Spot Light
    • Gallery
    • USA Show Times
    • Videos
    • Travel

    follow us

    • Facebook
    • Twitter
    • YouTube
    • Instagram
    • about us
    • Contact us
    • Privacy
    • Disclaimer

    Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.