iDreamPost
iDreamPost
బాహుబలి, సాహో తర్వాత భారీ గ్యాప్ తో వస్తున్న రాధే శ్యామ్ టీజర్ ఎట్టకేలకు ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలయ్యింది. లాక్ డౌన్ తో పాటు వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ తో జిల్ చేసి మెప్పించాక కేవలం ఈ సినిమా కోసమే ఐదేళ్ల సమయాన్ని వెచ్చించిన దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ ని మళ్ళీ లవర్ బాయ్ గా చూపించనున్నాడనే వార్త అభిమానులను ముందు నుంచే ఎగ్జైట్ చేస్తోంది. అందుకే అంచనాలు అంతకంతా పెరగడం మొదలయ్యాయి. మరి లవర్స్ డే సందర్భంగా వచ్చిన టీజర్ ఎలా ఉందో చూసేద్దాం.
వీడియోని కేవలం ఒక్క నిమిషం లోపే కట్ చేశారు. జన సమ్మర్ధం ఉన్న రైల్వే స్టేషన్ లో ప్రభాస్ ఎంట్రీ అక్కడి భాషలో ఏదో చెప్పడం దానికి బదులుగా అందరు అమ్మాయిలు తన వైపే చూడటం ఇదంతా ఒక ఫ్రేమ్ లో సాగింది. ఆ తర్వాత పూజా హెగ్డే ఎంట్రీ, నువ్వేమైనా లైలా మజ్ను రేంజ్ లో ప్రేమించాలనుకుంటున్నావా అనే ప్రశ్నకు నాది చావాలనుకునే ప్రేమ కాదు బ్రతికించాలనుకునేదని ప్రభాస్ బదులు చెప్పడం ఇదంతా ఇంకో సీన్ లో సాగింది. ఇందులో హీరో హీరోయిన్ల పేర్లు విక్రమాదిత్య, ప్రేరణ. వీళ్ళ ప్రేమ అక్కడ ఎందుకు మొదలయ్యింది ఎక్కడికి వెళ్ళింది లాంటి ప్రశ్నల కోసం ట్రైలర్ దాకా ఎదురు చూడాలి
చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ని లవర్ బాయ్ గా చూడటం బాగుంది. అయితే టీజర్ చిన్నదే అయినా చాలా ఆశించిన అభిమానులకు కావాల్సినంత మెటీరియల్ అయితే ఇందులో లేదు. కేవలం రెండు సీన్లతో సరిపెట్టారు. విడుదల తేదీని జూలై 30 అని ప్రకటించడం ఊరట కలిగించే అంశం. కెజిఎఫ్ 2కి దీనికి కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉండబోతుండటం విశేషం. తెలుగు వెర్షన్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న రాధే శ్యామ్ మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. మొత్తానికి బాహుబలి టైపు లో వేసవి చివరి సీజన్ ని టార్గెట్ చేసిన రాధే శ్యామ్ సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది.
Teaser Link @ http://bit.ly/2OD2Kqb