iDreamPost
android-app
ios-app

పొగరు సినిమా రిపోర్ట్

  • Published Feb 20, 2021 | 5:23 AM Updated Updated Feb 20, 2021 | 5:23 AM
పొగరు సినిమా రిపోర్ట్

కెజిఎఫ్ తర్వాత కన్నడ నిర్మాతలకు పాన్ ఇండియా ఆశలు పెరిగిపోయాయి. కంటెంట్ ఏదైనా సరే మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. సదరు హీరోలు మనకు పరిచయం ఉన్నారా లేదా అనేది పట్టించుకోకుండా నాలుగు డబ్బులు వస్తాయి కదాని ఇక్కడి సినిమాలకు కాంపిటీషన్ ఇస్తూ ఒకే రోజు రిలీజులకు సిద్ధపడుతున్నారు. కేవలం రష్మిక మందన్న హీరోయిన్ అన్న ఒకే ఒక్క కారణంగా పొగరుని ఇక్కడ అగ్రెసివ్ గా ప్రమోషన్ చేసిన తీరు మాస్ ఆడియన్స్ దృష్టిని ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. పెద్ద ఇనుప కొండలా ఉండే హీరో ధృవ సర్జ రూపం, ఖరాబు పాట యుట్యూబ్ లో బ్లాక్ బస్టర్ కావడం ఓపెనింగ్స్ కి దోహదపడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో మిని రిపోర్ట్ లో చూద్దాం.

ఇది ఓ నలభై ఏళ్లకు పైగా తెలుగు తెరపై చూసి చూసి అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి కమర్షియల్ కథ. శివ(ధృవ సర్జ)పసి వయసులోనే తండ్రిని కోల్పోతే తల్లి(పవిత్ర లోకేష్)గుట్టుగా రెండో పెళ్లి చేసుకుంటుంది. దీంతో శివ కరుడుగట్టిన మనస్తత్వంతో బండరాయిగా మారతాడు. ఓ టీచర్(రష్మిక మందన్న)తో ప్రేమాయణం కూడా మొదలెడతాడు. అంతా సవ్యంగా జరిగితే ఇది మాస్ సినిమా ఎలా అవుతుంది. విలన్ ఎంట్రీ, ఆ తర్వాత ఈజీగా ఊహించగలిగే మలుపులు, డ్రామాతో అటుఇటు తిరిగి ఓ డబ్ల్యుడబ్యుఎఫ్ రేంజ్ ఫైటింగ్ తో కథ క్లైమాక్స్ కు, భారమైన హృదయాలతో మనమింటికి చేరుకుంటాం. స్థూలంగా చెప్పుకుంటే పొగరులో ఇంతకన్నా ఏమి లేదు.

దర్శకుడు నందకిషోర్ ఇంత రొట్ట రొటీన్ కథకు ప్రొడ్యూసర్ తో పాతిక కోట్ల బడ్జెట్ ని ఎలా పెట్టించాడో ఎంత ఆలోచించినా అర్థం కాదు. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మీద దృష్టి పెట్టి మిగిలిన వ్యవహారమంతా లైట్ తీసుకోవడంతో రెండు గంటల నలభై నిమిషాలను భరించడం చాలా కష్టమనిపిస్తుంది. పోనీ రష్మిక కోసం చూద్దామా అంటే తను కేవలం పాటలు, కాసింత కామెడీ ట్రాక్ లో తప్ప ఎక్కడా కనిపించదు. దాదాపు సినిమా మొత్తం ప్రతి ఫ్రేమ్ లో ఘటోత్ఘచుడి అవతారంలో ధృవ సర్జానే దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఇతను శారీరకంగా పడిన కష్టాన్ని, అంత భారీ శరీరంతో చేసే డాన్సులను మెచ్చుకోవాలి. ఈ ఒక్క అంశం తప్ప పొగరు చూసేందుకు ఇంకే కారణం కనిపించదు. దీనికన్నా ఎప్పుడో వచ్చిన విశాల్ పొగరు ఎంచుకోవడం ఉత్తమం