ప్లాస్టిక్ తో స్వీట్లు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి. ఇదేమిటి ప్లాస్టిక్ తో స్వీట్లేమిటి..? అనుకుంటున్నారా..? మీరు చదువుతున్నది నిజమే. విజయనగం వెళితే ఈ నయా పంధా తెలుస్తుంది. విజయనగరం నగరపాలక సంస్థ నగరంలో ప్లాస్టిక్ నిర్ములన కు ఈ కొత్త రూటు లో వెళుతోంది. అందుకే ప్లాస్టిక్ కు స్వీట్లు ఇస్తోంది. కేజీ ప్లాస్టిక్ కు పావు కేజీ స్వీట్లు ఇస్తోంది.
ఒకసారి వాడి పడేసే (యూజ్ అండ్ త్రో) ప్లాస్టిక్ చాలా ప్రమాదమైంది. ఏళ్ల తరబడి అది భూమిలో ఉంటుంది. ఫలితంగా భూగర్భ జలాలు భూమిలో ఇంకకపోవడంతో పాటు అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ నివారించేలా నగరపాలక సంస్థ నడుం బిగించింది. స్థానిక రోటరీ క్లబ్ సహాయంతో ‘ప్లాస్టిక్ తో స్వీట్లు’ కార్యక్రమం చేపడుతోంది. ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే వారికి పావు కిలో స్వీట్‌బాక్స్ ఇస్తారు.
మరింత మంది దాతలు ముందుకొస్తే త్వరలో అర డజను గుడ్లను ప్యాక్ చేసి అందించాలని భావిస్తున్నారు. అదే పెద్ద పెద్ద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు ఒకేసారి 250 కిలోల ప్లాస్టిక్‌ను ఇస్తే వారికి భారీ నజరానా చెల్లించనున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై ప్రజల్లో అవగాహన పెరిగి, వాడకం పూర్తిగా తగ్గిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.