గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్ విజయ్ కు బాగా కలిసి వస్తోంది. రొటీన్ మాస్ ఎంటర్ టైనర్లతోనే ఇక్కడ మంచి వసూళ్లు దక్కించుకుంటున్నాడు. తుపాకీ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో అదిరింది, విజిల్ పెట్టుబడికి మించి లాభాలు ఇవ్వడంతో మాస్టర్ ని మొదటిసారి కనివిని ఎరుగని స్థాయిలో తెలుగులో భారీ విడుదల చేశారు నిర్మాత. రిలీజ్ కు ముందే దీని మీద విపరీతమైన హైప్ నెలకొనడం. ఖైదీతో మెప్పించిన దర్శకుడు కార్తీక్ కనగరాజ్ ఇమేజ్, అన్నింటిని మించి మొదటి సారి విజయ్-విజయ్ సేతుపతిల ఆన్ స్క్రీన్ కాంబినేషన్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లలు లాభాలు పండాయి.
నిజానికి మాస్టర్ కు వచ్చింది ఫ్లాప్ టాక్. ఆశించినట్టు లేదని క్రిటిక్స్ తో పాటు అధిక శాతం ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే అనూహ్యంగా మాస్టర్ తెలుగు వెర్షన్ సుమారుగా 14 కోట్ల 60 లక్షల దాకా షేర్ రాబట్టుకోవడం రికార్డు. అందులోనూ సగం ఆక్యుపెన్సీతో ఇంత మొత్తం అంటే చిన్న విషయం కాదు. సినిమా బాగున్నా లేకపోయినా ఖచ్చితంగా ఒకసారి చూడాలని మూవీ లవర్స్ ఫిక్స్ అవ్వడంతో పాటు ఎక్కువ స్క్రీన్ల లో రిలీజ్ చేయడం మాస్టర్ కు కలిసి వచ్చింది. ఇది ఇప్పుడు రాబోయే విజయ్ సినిమాల బిజినెస్ మీద కూడా ప్రభావం చూపబోతోంది. ఏరియాల వారీగా వచ్చిన చివరి వసూళ్ల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి
మాస్టర్ ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా | షేర్ |
నైజాం | 3.56cr |
సీడెడ్ | 2.71cr |
ఉత్తరాంధ్ర | 2.51cr |
గుంటూరు | 1.41cr |
క్రిష్ణ | 1.17cr |
ఈస్ట్ గోదావరి | 1.34cr |
వెస్ట్ గోదావరి | 1.25cr |
నెల్లూరు | 0.65cr |
ఆంధ్ర+తెలంగాణా | 14.60cr |
థియేట్రికల్ బిజినెస్ మీద సుమారు 6 కోట్లకు పైగా మాస్టర్ లాభాలను ఇచ్చాడు. క్రాక్ తర్వాత దీనిదే అధిక శాతం ప్రాఫిట్స్ అని చెప్పొచ్చు. రెడ్ కూడా ఇంత కన్నా ఎక్కువే తెచ్చినప్పటికీ దాన్ని అమ్మిన ధరలు వేరే కావడంతో లాభాలు తగ్గాయి. మాస్టర్ కు జరిగిన బిజినెస్సే 8 కోట్ల దాకా. ఈ లెక్కన ఇంత మార్జిన్ తెచ్చుకున్న మాస్టర్ ని కమర్షియల్ హిట్ క్యాటగిరీలో వేయాల్సిందే. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి అన్ని చోట్లా వసూళ్లు బాగా నెమ్మదించాయి. తర్వాత కొత్త సినిమాలు రావడం పోటీ పెరగడం మాస్టర్ ని ఫైనల్ రన్ వైపు తీసుకెళ్లింది. ఇంతకు మించి కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు.
Verdict: HIT