కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి సీరియల్ ఇప్పట్లో ముగిసే లేదు డైలీ సీరియల్ లాగా రోజు ఏదో ఒక విషయంలో కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా విమర్శల పర్వం కొనసాగుతుంది. దింతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డికి వర్గానికి తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. సీనియర్ నేతలంతా సైలెంట్ అయిపోయి ఎవరి పని వారు చేసుకుంటున్నా కోమటిరెడ్డి మాత్రం పిసిసి ని టార్గెట్ చేస్తూ వర్షం విమర్శలు చేస్తు కొరకారని కోయ్యగా మారారు.
సందర్భం ఏదైనా కోమటి రెడ్డి రేవంత్ రెడ్డి వర్గాన్ని వదిలిపెట్టడం లేదు. పిసిసి పదవి ఆశించి దక్కకపోవడంతో పీసీసీ పదవి అమ్ముడు పోయిందని తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి వర్గం పై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని టీడీపీ కాంగ్రెస్ గా మార్చేశరని తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. అయితే హైకమాండ్ రంగంలోకి దిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుజ్జగించినట్లు కనిపించిన మొదట్లో రేవంత్ రెడ్డి వర్గానికి సపోర్ట్ చేయకున్నా సైలెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తాజాగా వైఎస్ఆర్ సంస్మరణ సభ తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అలజడిని సృష్టించింది. పార్టీ ఆదేశాలను ధిక్కరించి వైఎస్ఆర్ సంస్మరణ సభకు కోమటిరెడ్డి వెళ్లడాన్ని వైఎస్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉదయం నిర్వహించిన సభకు వెళ్లడం పార్టీని ధిక్కరించినట్లేనని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
దీనిపై స్పందించిన కోమటిరెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సభకు వెళితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల ముందు తనకు ఆహ్వానం అందిందని కానీ రెండు గంటల ముందు వైఎస్ఆర్ సంస్మరణ సభకు వెళ్లొద్దని పార్టీ ఆదేశించడం ఎంతవరకు సమంజసమని రేవంత్ రెడ్డి వర్గంపై ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను చిన్నపిల్లాడిని కాదని తనపై డిక్టేటర్ షిప్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళమీద పడుతున్నారని ఇది వాళ్లకు కనిపించడం లేదా అని పరోక్షంగా సీతక్కను టార్గెట్ చేస్తూ విమర్శించారు.
పార్టీ ఆదేశాలను దిక్కరిస్తూ కోమటిరెడ్డి వైయస్సార్ సంస్మరణ సభకు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే కోమటిరెడ్డి పార్టీని విడిచి వెళ్లిపోవచ్చని అంతేగాని ఇలాంటి పనులతో పీసీసీ పరువు తీయవద్దని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మధుయాష్కీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించిన కోమటిరెడ్డి తనకు తానుగా పార్టీ వీడేది లేదని.. పంపిస్తే వెళ్లిపోయేందుకు సిద్ధమే అని అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు.
దీంతో కోమటిరెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. కోమటి రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీలో ఇలా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడో అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. కోమటిరెడ్డి ని కంట్రోల్ చేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేసి కోమటిరెడ్డి ని కంట్రోల్ చేస్తారా లేక కోమటిరెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే సాహసం చేస్తారా అని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.