తెలుగుదేశం కోలుకోలేదని గ్రహించిన పలువులు నేతలు అధికార వైసిపి పార్టీలో చేరడానికి షరతులు ఉండటంతో రాజకీయంగా ఉనికిని చాటుకోవాలంటే కేంద్రలో అధికారంలో ఉన్న బిజేపి ఏ మంచి మార్గం అని భావించి ఇప్పటికే ఆ పార్టీలోకి వెళ్ళిపోగా మరికొందరు అదే బాటలో నడుస్తున్నారు. జే.సి దివాకర్ రెడ్ది కూడా తెలుగుదేశం వీడి కుమారుడు పవన్ తో కలిసి బిజేపిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అదే జిల్లాకు చెందిన ధర్మవరం మాజీ శాశన సభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణ కాషాయం కండువా కప్పుకున్నారు. ఇప్పుడు అదే బాటలో జేసి కుటుంబం కూడా బి.జే.పి లొకి వెళ్ళటానికి రంగం సిద్దం చేసుకున్నారని ఈ విషయమై ఇప్పటికే డిల్లీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తుంది.
తాజాగ జే.సి దివాకర్ రెడ్డి బిజేపి జాతియ కార్యదర్శి సత్య కుమార్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం తరువాత జే.సి మాట్లాడుతు జాతియ పార్టీలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్తూనే బిజేపి నేతలను కలవటంలో ఎలాంటి ప్రాధాన్యత లేదని మర్యాద పుర్వకంగానే సత్య కుమార్ ని కలిశానని చెప్పుకొచ్చారు. జే.సి మొదటి నుండి ఏ పార్టీలో ఉన్న పెడసరి వ్యాఖ్యలు చేస్తు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేక హొదా విషయమై మా వాళ్ళు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తున్నారని చంద్రబాబు అంటే పోరాటమా వంకాయా అని హేళన చెశారు. జే.సి, చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలు అనవసరమని చెప్పటం,చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే 40% సిట్టింగులకి సీట్ ఇవ్వకూడదని బహిరంగంగా చెప్పటం లాంటి పెడసరి వ్యాఖ్యలతో ఎప్పుడు చర్చల్లోని వ్యక్తిగా ఉంటూ వచ్చారు. ఇక తాజగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీరుపై ఆయన సమక్షంలోనే సభలో తీవ్రంగా ఎండగటిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షుడు చంద్రబాబు పై తీవ్రమైన అసహనంతో ఉన్నారన్న విషయం బహిర్గతం అవుతుంది.
2019 ఎన్నికల్లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తెలుగుదేశం నుంచి పోటిలో ఉన్న జే.సి కుటుంబం ఓడిపోవటంతో అప్పటివరకు జిల్లాలో ఏకఛత్రాధిపత్యంగా సాగిన జే.సి కి అడ్డంకులు మొదలైయ్యాయి. అక్రమంగా నడిపిన 47 బస్సుల మీద వేటు పడటం, త్రిసూల్ కంపెనీ కి మైనింగ్ కి ఇచ్చిన 1605 ఎకరాలపై నీలి నీడలు కమ్ముకోవటం , పోలీసులపై చేసిన అనుచిత వాఖ్యల పర్యవసానంగాగా నమోదైన కేసులతో ఇబ్బందిపడుతున్న జె.సి బ్రదర్స్ కి అందరిలాగే బిజేపి పునరావాస కేంద్రం అవ్వబోతోందో లేదో వేచి చూడాలి.