iDreamPost
android-app
ios-app

‘రాజధాని కి మంగళగిరి అనువైన ప్రాంతం’

‘రాజధాని కి మంగళగిరి అనువైన ప్రాంతం’

గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న మంగళగిరి ప్రాంతం రాజధాని బిల్డింగుల నిర్మాణానికి ఎంతో అనువైన ప్రాంతమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కమిటీ ఏర్పాటుపై స్పందించారు. గతంలో కూడా రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, తాడికొండ దిగువ ప్రాంతంగా అమరావతి ఉండటం వలన సరైంది కాదని శ్రీకృష్ణ కమిటీ చెప్పినప్పటికీ చంద్రబాబు బలవంతంగా భూములను లాక్కొని నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబు ల్యాండ్ పోలింగ్‌కు ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. మంగళగిరిలో దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. కమిటీ సభ్యులకు ఇక్కడ నిర్మాణం జరగాలని కోరతానని చెప్పారు.