Swetha
సోషల్ మీడియా యుగంలో ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆకర్షించే వీడియోలు.. ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా క్లాస్ రూమ్ లో ఓ టీచర్ ఐటెం సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా యుగంలో ఎప్పటికప్పుడు నెటిజన్లను ఆకర్షించే వీడియోలు.. ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా క్లాస్ రూమ్ లో ఓ టీచర్ ఐటెం సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Swetha
ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో .. సామజిక మాధ్యమాల ద్వారా అందరూ తెగ ఫేమస్ అయిపోతున్నారు. ఎవరైనా వారికీ సంబంధించిన ఒక వీడియోను వారి వారి సోషల్ మీడియా ఖాతాల్లో అప్ లోడ్ చేశారంటే చాలు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సరే.. నిమిషాల్లో షేర్స్, గంటల్లో వైరల్, రోజుల్లో ట్రెండింగ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లో ఎన్నో రకాల కొత్త వీడియోలు, ఫోటోలు నెటిజన్ల కంట పడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా.. క్లాస్ రూమ్ లో ఓ టీచర్ .. ఐటెం సాంగ్ కు డ్యాన్స్ వేస్తుండగా.. స్టూడెంట్స్ ఆమెను ఎంకరేజ్ చేస్తున్న వీడియో ఒకటి.. తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోను గమనిస్తే.. క్లాస్ రూమ్ లో టీచర్ బర్త్ డే వేడుకలు సెలెబ్రేట్ చేస్తున్న క్రమంలో.. ఆమె ఈ డ్యాన్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఓ బాలీవుడ్ చిత్రం బంటి ఔర్ బబ్లీలో ఐశ్వర్యరాయ్ చేసిన గజరారే పాటకు.. అద్భుతంగా డ్యాన్స్ చేస్తుండగా.. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా ఈ డ్యాన్స్ ను చేయడంతో.. అది కాస్త సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇక ఆమె డ్యాన్స్ చూసిన నెటిజన్లు.. ఫిదా అయిపోయి.. ఈ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యాలయాన్ని దేవాలయంలా భావిస్తూ.. విలువలకు ప్రాధాన్యతనిచ్చే మన దేశంలో.. ఇలా క్లాస్ రూమ్ లో ఐటెం సాంగ్ కు డ్యాన్స్ చేయడం సరైన పద్దతి కాదని.. కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది టీచర్ అయితే డ్యాన్స్ చేస్తే తప్పేముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ తో వైరల్ అవుతూ ఉంది.
ఇప్పుడు ఎలా అయితే ఈ వీడియో వైరల్ అవుతోందో.. 2023 డిసెంబర్లో ప్రముఖ గజల్ పాట గులాబీ షరారపై.. ఓ టీచర్ తన విద్యార్థులతో కలిసి చేసిన డ్యాన్స్ కూడా ఇలానే సోషల్ మీడియాలో షికార్లు చేసింది. అప్పడు కూడా నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దానికి స్వయంగా ఆ టీచర్ స్పందించి.. అది క్లాస్ రూమ్ లో తీసింది కాదని సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంలో విద్యార్థులతో పని చేసిందని.. క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనా ఇంటర్నెట్ లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉండడం.. దానిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలూ వ్యక్తం చేయడం అనేది.. సర్వసాధారణం. మరి, ఇప్పుడు ఇంటర్నెట్ లో షికార్లు చేస్తున్న ఈ టీచర్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Never imagined we’d see a day where teachers are dancing literally on an item song inside a classroom. pic.twitter.com/4mKUl05RHY
— Jeetas posting their L”s (SWAGGY ERA) (@yeazlas) March 16, 2024