ఏ సినీ పరిశ్రమలోనైనా హీరోలదే హవా. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ప్రధాన కారణం వాళ్లే. ఇందులో ఎంలాంటి సందేహం లేదు. ఏ చిత్రానికైనా కథానాయకుడే కీలకం. అందుకే వారికి అంత స్థాయిలో రెమ్యూనరేషన్లు కట్టబెడతారు నిర్మాతలు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం హీరోల స్థాయిలో క్రేజ్ దక్కించుకుంటున్నారు. అంతేకాదు, లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ హీరోల రేంజ్లో కాకపోయినా భారీగా పారితోషికాన్ని అందుకుంటున్నారు. అలాగే తమ నటన, అందం, సేవాగుణంతో సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను ఏర్పర్చుకుంటున్నారు. అలాంటి అరుదైన హీరోయిన్లలో సమంత ఒకరు. తొలుత కమర్షియల్ ఫిల్మ్స్‌తో స్టార్డమ్ సంపాదించిన సమంత.. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో తన ఇమేజ్ను మరింత పెంచుకున్నారు.
సమంత ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ఒప్పుకున్నారు, అందులో యాక్ట్ చేస్తున్నారంటే దానికి ఆటోమేటిక్‌గా బజ్ వచ్చేస్తోంది. కంటెంట్ ఉన్న కథలకు ప్రాధాన్యం ఇస్తున్న సమంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆమె నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. హిందీలో సామ్ చేస్తున్న ‘సిటాడెల్’ సిరీస్ రీమేక్ కూడా తుదిదశకు చేరుకుంది. ‘ఖుషి’ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలయ్యాయి. రీసెంట్గా ఈ సినిమా నుంచి ‘ఆరాధ్య’ అనే సాంగ్ విడుదలైంది. అయితే ఈ పాటలోని ఒక సీన్ వివాదానికి కారణమైంది. ఈ సాంగ్‌లోని ఒక సీన్లో సమంత భుజాన్ని విజయ్ దేవరకొండ తన కాలితో తడుతూ కనిపించారు. ఇది చూసిన పలువురు నెటిజన్స్.. ఆ పోస్టర్‌పై విమర్శలకు దిగుతున్నారు.
పదేళ్ల కింద సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్: నేనొక్కడినే’ పోస్టర్‌కు సంబంధించి సమంత పోస్ట్ చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆమెకు క్లాస్ పీకుతున్నారు నెటిజన్స్. మహేష్ మూవీ పోస్టర్లో ఆయన్ను అనుసరిస్తూ హీరోయిన్ కృతి సనన్ మోకళ్లపై నడుస్తూ కనిపించారు. అప్పుడు దానిపై సామ్ ఒక ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ దారుణంగా ఉందని, ఇది మహిళలను తక్కువ చేయడమే అనే ఉద్దేశం వచ్చేలా సామ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కామెంట్స్‌నే నెటిజన్స్ గుర్తుచేస్తున్నారు. దీనిని ఏం అంటారు మేడమ్.. ఇలా చేయడం మహిళల్ని తక్కువ చేసినట్లు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఒకర్ని ఏదైనా అనేముందు అదే పరిస్థితి మనకు రాదనుకుంటే అదే కర్మ.. అది అస్సలు వదలదు అంటూ సమంతకు క్లాస్ పీకుతున్నారు. మరి.. ‘ఆరాధ్య’ సాంగ్ పోస్టర్‌పై మీరు ఏం అనుకుంటున్నారనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
No Hate But Sorry #Samantha
Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) July 12, 2023
#MaheshBabu #samantha #vijay #kushi @Samanthaprabhu2 how are you?😇 pic.twitter.com/7aqvBdyxnU
— Angrybird (@Angrybird8639) July 12, 2023
@Samanthaprabhu2 🤡 😴#MaheshBabu #Samantha #GunturKaaram #khushi pic.twitter.com/img6N2HBku
— 𝙐𝙨𝙩𝙝𝙖𝙖𝙙🔥ᵖˢᵖᵏ𝙘𝙪𝙡𝙩🦅 (@USTHAAD_PK_CULT) July 13, 2023
Samantha Landed In Fresh Controversy — Past is Not Leaving Her!!!!https://t.co/kFFO4YzFxP#SamanthaRuthPrabhu #Samantha #Kushi #VijayDeverakonda #MaheshBabu𓃵 #1Nenokkadinebu𓃵
— CineJosh (@cinejosh) July 13, 2023