Mahalakshmi Scheme: మహిళలకు నెలకు రూ.2500.. వాటిని నమ్మకండి అంటున్న అధికారులు

Mahalakshmi Scheme: మహిళలకు నెలకు రూ.2500.. వాటిని నమ్మకండి అంటున్న అధికారులు

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ పథకాలు సంబంధించిన అనేక తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాటిని నమ్మవద్దు అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ పథకాలు సంబంధించిన అనేక తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాటిని నమ్మవద్దు అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఎలక్షన్స్ కి ముందు ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే తొలి సంతకం చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. వీటి ముసాయిదాపై ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత కేబినెట్ వాటికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆరు గ్యారెంటీల్లో.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు చేయూత అమల్లోకి వచ్చింది. మిగతా హామీలన్ని.. వంద రోజుల్లోపు అమల్లోకి వస్తాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడమే కాక.. ఫ్రీ జర్నీని అమలు చేస్తున్నారు. ఇక త్వరలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం అమల్లోకి రానుంది. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు పొందాలంటే.. 18-55 ఏళ్ల లోపు మహిళలు మాత్రమే అర్హులని.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కరెంట్ బిల్లు తప్పనిసరి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

చాలా మంది మహిళలు ఈ ప్రచారాన్ని నిజమే అని నమ్మి.. ఆయా పత్రాల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఇది కాస్త అధికారులు దృష్టికి చేరడంతో.. వారు దీనిపై స్పందించారు. మహిళలకు నెలకు 2500 పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధివిధానాలు రూపొందించలేదని.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని.. ఈలోపు తప్పుడు ప్రచారాలు నమ్మి.. మోసపోవద్దని హెచ్చరించారు.

అలానే రూ.500 కే గ్యాస్ పథకం కూడా త్వరలోనే అమలువుతుందని.. రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వందరోజుల్లో.. ఇవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వరికి 500 రూపాయల బోనస్ కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలు కట్టుబడి ఉందని తెలిపారు.

Show comments