Krishna Kowshik
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు.
Krishna Kowshik
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అస్వస్థతకు గురయ్యారు. ఎనుముల తిరుపతి రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయన్ను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడంగా ఉందని బంధువులు వెల్లడించారు. మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోదరుడ్ని సీఎం రేవంత్ మరో సోదరుడు కొండల్ రెడ్డి పరామర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు రేవంత్ రెడ్డి. అక్కడ రేవంత్ రెడ్డి విజయం సాధించడంలో ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. నియోజక వర్గంలో మంచి పట్టు ఉండటమే కాకుండా.. యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆయన వెంటే సోదరుడు నడిచినట్లు కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి మహబూబ్ నగర్ నుండి పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ స్థానాన్ని చల్లా వంశీ చంద్ రెడ్డికి కేటాయించారు సీఎం రేవంత్.