కప్పు కావాలంటే రోహిత్ ఆ ఒక్క పని చేయాలి.. ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన!

టీ20 వరల్డ్ కప్-2024 ప్రిపరేషన్స్​ను ఘనంగా స్టార్ట్ చేసిన టీమిండియా.. మెయిన్ మ్యాచెస్​ కోసం ఎదురుచూస్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను భయపెట్టాలని భావిస్తోంది.

టీ20 వరల్డ్ కప్-2024 ప్రిపరేషన్స్​ను ఘనంగా స్టార్ట్ చేసిన టీమిండియా.. మెయిన్ మ్యాచెస్​ కోసం ఎదురుచూస్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను భయపెట్టాలని భావిస్తోంది.

టీ20 వరల్డ్ కప్-2024లో విజేతగా నిలవాలనే కసితో ఉన్న టీమిండియా ప్రిపరేషన్స్​ను ఘనంగా ఆరంభించింది. బంగ్లాదేశ్​తో శనివారం జరిగిన వార్మప్ మ్యాచ్​లో రోహిత్ సేన 60 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లు ఆడి 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. ట్రికీ పిచ్ మీద రన్స్ చేయడం కష్టమైంది. దీంతో బంగ్లా అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ గెలుపుతో ప్రధాన మ్యాచులకు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది భారత్. అమెరికా వాతావరణ పరిస్థితులు, పిచ్​లను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడింది. ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ కూడా అయింది.

నిన్నటి మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఉన్నంత సేపు బిగ్ షాట్స్ ఆడుతూ అలరించాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఆఖరి వరకు నాటౌట్​గా ఉండి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్​లోనూ 1 వికెట్​తో రాణించాడు. ఐపీఎల్​-2024లో హిట్​మ్యాన్​ ఫర్వాలేదనిపించినా.. హార్దిక్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు కెప్టెన్​గానూ నిరాశపర్చాడు. వీళ్లిద్దరి మధ్య కెప్టెన్సీ వివాదం చిచ్చు పెట్టడంతో క్యాష్​ రిచ్ లీగ్​లో ఎడమొహం పెడమొహంగానే కనిపించారు. దీంతో వరల్డ్ కప్​లో ఎలా ఆడతారు? కలసి టీమ్​ను నడిపిస్తారా? అనే సందేహాలు తలెత్తాయి. అయితే వార్మప్ మ్యాచ్​లో వీళ్లు సరదాగా కనిపించడం, మ్యాచ్​లో రాణించడంతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కప్పు కావాలంటే రోహిత్, హార్దిక్ అన్ని విషయాలను మర్చిపోవాలని పఠాన్ సూచించాడు. ఐపీఎల్​లో ఏం జరిగిందనేది పక్కనబెట్టి కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం చెబితే అదే వినాలని అన్నాడు. హిట్​మ్యాన్, పాండ్యా భారత జట్టుకు ఎంతో ముఖ్యమని తెలిపాడు. ‘మెగా టోర్నీలో ఆడుతున్న టైమ్​లో ఐపీఎల్ గురించి మాట్లాడిన అవసరం లేదు. ఐపీఎల్ విషయాలను వదిలేసి ముందుకెళ్లాల్సిన తరుణం వచ్చేసింది. ఒక్కసారి కూడా లీగ్ విషయాలను ఇక్కడ ప్రస్తావించకూడదు. హార్దిక్ లేదా రోహిత్ ఎవరైనా కానివ్వండి.. కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన విషయాల మీదే ఫోకస్ చేయాలి. టీమ్ ఏం కోరుకుంటుందో అది చేస్తే చాలు’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు. మరి.. హార్దిక్, రోహిత్ ఐపీఎల్ విషయాలను మర్చిపోవాలనే సూచనపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments