రోహిత్​పై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మిగతావాళ్ల కంటే స్పెషల్ అంటూ..!

  • Author singhj Published - 06:19 PM, Thu - 2 November 23

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగతా ప్లేయర్లతో పోలిస్తే హిట్​మ్యాన్ చాలా స్పెషల్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగతా ప్లేయర్లతో పోలిస్తే హిట్​మ్యాన్ చాలా స్పెషల్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.

  • Author singhj Published - 06:19 PM, Thu - 2 November 23

వరల్డ్ కప్-2023లో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్క మ్యాచ్​లో కూడా ఓడిపోలేదు భారత్. వరుసగా డబుల్ హ్యాట్రిక్​ కొట్టి సెమీస్​కు అత్యంత చేరువగా వచ్చింది టీమిండియా. సెమీఫైనల్ బెర్త్​ను అఫీషియల్​గా కన్ఫర్మ్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీలంకతో తలపడేందుకు రోహిత్ సేన రెడీ అయింది. ఈ మ్యాచ్​లో ఓటమి భారత్​కు కాదు గానీ లంకకు చాలా కీలకం. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఆ టీమ్​ ఈ మ్యాచ్​లో తప్పక గెలవాల్సిందే. ఒకవేళ టీమిండియా చేతుల్లో ఓడిపోతే మాత్రం మెగా టోర్నీ సెమీఫైనల్ రేసు నుంచి శ్రీలంక దాదాపుగా నిష్క్రమించినట్లే అవుతుంది. అందుకే ఈ మ్యాచ్​ను ఆ టీమ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

ఒకవైపు లంక ఎలాగైనా నెగ్గాలని భావిస్తుంటే.. మరోవైపు భారత్ కూడా తమ విజయాల పరంపరను కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే సెమీస్ బెర్త్ అధికారికంగా సొంతం చేసుకోవచ్చు. కాబట్టి మ్యాచ్​ను ఈజీగా తీసుకోవద్దని అనుకుంటోంది. బౌలర్లు భీకర ఫామ్​లో ఉన్నారు. జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్​లో రన్స్ తీయలేక, వికెట్లను కాపాడుకోలేక ప్రత్యర్థి బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో టీమిండియా బౌలర్లను ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కావడం లేదు. బౌలింగ్ యూనిట్​తో పాటు భారత బ్యాటింగ్ డిపార్ట్​మెంట్ కూడా ఎంతో స్ట్రాంగ్​గా ఉంది. శుబ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్​లను మినహాయిస్తే మిగతా బ్యాటర్లు సూపర్ ఫామ్​లో ఉన్నారు. వీళ్లిద్దరూ రిథమ్​ను అందుకుంటే రోహిత్ సేను జోరును ఎవ్వరూ ఆపలేరు.

లంకతో మ్యాచ్​లోనూ గెలిచి సెమీస్ రేసులోకి దూసుకెళ్తాలని భారత టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ అనుకుంటున్నాడు. అప్పుడే సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్​లో బుమ్రా, కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మపై భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ మిగతావాళ్లలా కాదు.. చాలా స్పెషల్ అని మెచ్చుకున్నాడు. రికార్డులు సాధించాలనే స్వార్థం అతడికి లేదని ఇన్​డైరెక్ట్​గా అన్నాడు గవాస్కర్. ‘ఇంగ్లండ్​తో మ్యాచ్​లో రోహిత్ ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్లు త్వరగా పడిన టైమ్​లో కేఎల్ రాహుల్​తో కలసి అతడు ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. సెంచరీ కోసం ఆలోచించి స్లోగా బ్యాటింగ్ చేయలేదు. తన న్యాచురల్ గేమ్​ను ఆడుకుంటూ వెళ్లాడు’ అని గవాస్కర్ మెచ్చుకున్నాడు. మరి.. రోహిత్​పై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్‌ శర్మ టీమిండియాకు దూరంగా ఉండాలి: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

Show comments