నెదర్లాండ్స్.. ఇక ఈ టీమ్‌ను పసికూన అనడానికి ఎవరైనా భయపడాల్సిందే. వరల్డ్ కప్‌లో ఈ టీమ్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్‌కు షాకిచ్చిన డచ్ టీమ్.. ఇవాళ బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.
నెదర్లాండ్స్.. ఇక ఈ టీమ్‌ను పసికూన అనడానికి ఎవరైనా భయపడాల్సిందే. వరల్డ్ కప్‌లో ఈ టీమ్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్‌కు షాకిచ్చిన డచ్ టీమ్.. ఇవాళ బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.
వన్డే వరల్డ్ కప్-2023లో నెదర్లాండ్స్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ లాంటి డేంజరస్ టీమ్‌ను పసికూనగా చేసి చిత్తుగా ఓడించింది. ఒక ప్రపంచ కప్‌లో డచ్ టీమ్ రెండు విజయాలు సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 రన్స్‌కు ఆలౌటైంది. టార్గెట్ పెద్దగా లేకపోయినా దాన్ని ఛేజ్ చేయడంలో ఫెయిలై పరాజయం పాలైంది బంగ్లాదేశ్. ఆ జట్టు లక్ష్య ఛేదనలో 142 రన్స్‌కే కుప్పకూలింది. బంగ్లా టీమ్‌లో టాప్-6 బ్యాటర్లలో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీన్ని బట్టే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహ్దీ హసన్ మిరాజ్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెయిన్ బ్యాటర్స్ అయిన లిట్టన్ దాస్ (3), నజ్ముల్ హొస్సేన్ శాంటో (9), షకీబల్ హసన్ (5), ముష్ఫికర్ రహీం (1) ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మహ్మదుల్లా (20), తాంజిద్ హసన్ (15) రన్స్ చేశారు. డచ్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచాడు. బాస్ డీ లీడే 2 వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్, వాన్ బీక్, అ కెర్మాన్‌కు ఒక్కో వికెట్ లభించింది. బంగ్లా ఏ దశలోనూ ఛేజింగ్ చేసేలా కనిపించలేదు. మొదటి నుంచి స్లోగా ఆడిన లిట్టన్ దాస్‌ను ఆర్యన్ దత్ నాలుగో ఓవర్లో వెనక్కి పంపాడు.
వాన్ బీక్ బౌలింగ్‌లో తాంజిద్ హసన్ పెవిలియన్ చేరాడు. షకీబ్, నజ్ముల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. 70 రన్స్‌కే ఆ టీమ్ 6 వికెట్లు కోల్పోయింది. ఈ టైమ్‌లో మహ్మదుల్లా, మెహ్దీ హసన్ నిలకడగా ఆడటంతో స్కోరు 100 దాటింది. ఆ తర్వాత వాళ్లూ ఔటయ్యారు. ఇక నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో స్కాట్ ఎడ్వర్డ్స్ (68), వెస్లీ బరేసి (41), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35) రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షోరిపుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మెహ్దీ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. షకీబల్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి 9వ ప్లేస్‌కు చేరుకుంది నెదర్లాండ్స్. మరి.. డచ్ టీమ్ పెర్ఫార్మెన్స్పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆసీస్-కివీస్ మ్యాచ్‌లో పరుగుల వర్షం.. వరల్డ్ కప్ హిస్టరీలో సరికొత్త రికార్డు!
NETHERLANDS DEFEATED BANGLADESH AT EDEN GARDENS…!!! 🇳🇱 pic.twitter.com/Z7qAizk3ZD
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023