టీ20 వరల్డ్‌ కప్‌ ముందు కోహ్లీ గురించి విల్‌ జాక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీ20 వరల్డ్‌ కప్‌ ముందు కోహ్లీ గురించి విల్‌ జాక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Will Jacks, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Will Jacks, Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం టీ20 వరల్డ్‌ కప్‌ 2024పై ఫోకస్‌ పెట్టి ఉన్నాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ.. అదే ఊపును టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా కొనసాగించాలని భావిస్తున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ఆడే జట్టు ఇప్పటికే అమెరికా చేరుకోగా.. కోహ్లీ ఇంకా టీమ్‌తో కలవలేదు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో ఉన్నాడు. వీలైంత త్వరగా కోహ్లీ టీమ్‌తో కలవనున్నాడు. అయితే.. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత.. కోహ్లీతో కలిసి ఆర్సీబీకి ఆడిన ఇంగ్లండ్‌ ఆటగాడు విల్‌ జాక్స్‌ తాజాగా విరాట్‌ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ఆడాడు జాక్స్‌. అయితే.. కోహ్లీ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావ్‌ అని ఎదురైన ప్రశ్నకు విల్‌ జాక్స్‌ బదులిస్తూ… కోహ్లీ ఫ్యాన్స్‌కు గుస్‌బమ్స్‌ తెప్పించేలా మాట్లాడాడు. మరి అతను ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

విల్‌ జాక్స్‌ మాట్లాడుతూ.. ‘ముందు కోహ్లీ ట్రైనింగ్‌ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి రోజు కచ్చితంగా ట్రైనింగ్‌లో పాల్గొంటాడు. కొంతమంది కుర్రాళ్లు సైతం రోజూ ట్రైనింగ్‌ అంటే చాలా ఇబ్బంది పడతారు. కానీ, కోహ్లీ మాత్రం అలా కాదు. అలాగే కోహ్లీ ఆడే విధానం వేరే. ప్రతి బంతికి తన వందశాతం ఇచ్చేందుకు తపన పడతాడు. ముఖ్యంగా ఛేజింగ్‌ సమయంలో అతని ప్లానింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఏదో బాల్‌ వచ్చింది కొట్టేయడం కాకుండా.. ఒక్క ప్లానింగ్‌తో ఆడతాడు. ఛేజింగ్‌ ఎలా చేయాలో అతనికి బాగా తెలుసు. బాల్‌ టూ బాల్‌ ఆడటం కాదు.. లాంగ్‌ వేలో ఆలోచించి.. ఎక్కడ స్లోగా ఆడాలో, ఎక్కడ రిస్క్‌ తీసుకోవాలో అతని తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో.’ అని జాక్స్‌ అన్నాడు.

ఐపీఎల్‌ 2024లో సీజన్‌లో ఆర్సీబీ ఎలాంటి ప్రదర్శన చేసిందో అందరు చూశారు. సీజన్‌ ఆరంభం నుంచి ఆర్సీబీ బ్యాటింగ్‌ భారం మొత్తం ఒక్క విరాట్‌ కోహ్లీనే మోశాడు. కానీ, విల్‌ జాక్స్‌ టీమ్‌లోకి వచ్చిన తర్వాత కోహ్లీ అదనపు బలం యాడ్‌ అయింది. తొలి 8 మ్యాచ్‌ల్లో 7 ఓడిపోయిన ఆర్సీబీ.. తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి.. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్‌కి ముందు విల్‌ జాక్స్‌ దేశం తరఫున ఆడేందుకు ఐపీఎల్‌ విడిచి వెళ్లిపోయాడు. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ 2024లో తమ అద్భుత ప్రస్థానం ముగించింది. మరి విరాట్‌ కోహ్లీ గురించి విల్‌ జాక్స్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments