Team India is supported by South Africa star cricketer father: జెర్సీ ధరించి.. టీమిండియాకు సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ తండ్రి మద్దతు

జెర్సీ ధరించి.. టీమిండియాకు సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ తండ్రి మద్దతు

వన్డే వరల్డ్ కప్ సమరం క్రికెట్ ప్రియుల్లో ఫుల్ జోష్ నింపేస్తోంది. ప్రధాన జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. కాగా వరల్డ్ కప్ లో భాగంగా చెన్నై వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కెఎల్ రాహుల్, కింగ్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకోగా టీమిండియా ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టించారు.

తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలినా రాహుల్, కోహ్లీలు మ్యాచ్ ను చక్కదిద్దటంతో టీమిండియా విజయభేరి మోగించింది. కాగా ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఓ స్టార్ క్రికెటర్ తండ్రి హిట్ మ్యాన్ జెర్సీ ధరించి టీమిండియాకు మద్దతు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కగిసో రబాడ తండ్రి ఎంఫో రబాడ టీమిండియా కెప్టెన్, దిగ్గజ ఆటగాడైన రోహిత్ శర్మ జర్సీని ధరించి భారత్ కు మద్దతు తెలిపాడు.

రోహిత్ శర్మకు కోట్ల మంది అభిమానులున్న విషయం తెలిసిందే. కాగా హిట్ మ్యాన్ కు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఫ్యాన్స్ విజిల్స్ కేరింతలో స్టేడియం దద్దరిల్లేలా చేస్తారు. ఈ క్రమంలో రబాడ ఫాదర్ రోహిత్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే రోహిత్ జర్సీ ధరించిన రబాడ తండ్రి భారత్ కు మద్ధతు తెలిపారు. టీమిండియా మద్దతుదార్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ తో కలిసి స్టేడియంలో సందడి చేశారు. సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ తండ్రి హిట్ మ్యాన్ జెర్సీ ధరించి టీమిండియాకు మద్దతు తెలపడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

Show comments