Team India: 2024లో టీమిండియా ముందున్న ఛాలెంజెస్‌.. ఈ ఏడాదైనా కల నెరవేరుతుందా?

2024 ఏడాదిలోకి అడుగుపెట్టిన టీమిండియా ముందు చాలా ఛాలెంజెస్‌ ఉన్నాయి. అయితే.. కొత్త ఏడాదిలో టీమిండియా ముందున్న టార్గెట్స్‌ ఏంటి.. ? అన్నింటి కంటే ముఖ్యమైన గోల్‌ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

2024 ఏడాదిలోకి అడుగుపెట్టిన టీమిండియా ముందు చాలా ఛాలెంజెస్‌ ఉన్నాయి. అయితే.. కొత్త ఏడాదిలో టీమిండియా ముందున్న టార్గెట్స్‌ ఏంటి.. ? అన్నింటి కంటే ముఖ్యమైన గోల్‌ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ప్రపంచంతో పాటు టీమిండియా సైతం 2023ని ముగించుకుని.. 2024లోకి అడుగుపెట్టేసింది. ఈ నెల 3న సౌతాఫ్రికాతో చివరిదైన రెండో టెస్ట్‌తో టీమిండియా తన వేటను మొదలు పెట్టనుంది. ఇదే సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమితో 2023ను ముగించిన రోహిత్‌ సేన.. 2024ను మాత్రం కేప్‌టౌన్‌ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో గెలిచి.. విజయంతో ప్రారంభించాలనుకుంటుంది. అందుకోసం ఇప్పటికే టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. తొలి టెస్ట్‌లో విఫలమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రెండో టెస్టులో ఎలాగైనా సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

కాగా, ఈ ఒక్క టెస్టే కాదు.. ఈ ఏడాదిలో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్‌లో నెగ్గాలని కూడా టీమిండియా భావిస్తోంది. పైగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ 2024 జరగనున్న నేపథ్యంలో టీమిండియా మరింత ఫోకస్‌గా ఉంది. ఇప్పటికే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోల్పోయిన బాధ.. ప్రతి భారత క్రికెటర్‌ గుండెలో రగులుతూనే ఉంది. దాన్ని చల్లార్చుకోవాలంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ను గెలవడం ఒక్కటే మార్గమని టీమిండియా క్రికెటర్లతో పాటు, ప్రతి భారత క్రికెట్‌ అభిమాని భావిస్తున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ మిస్‌ అయిపోయింది.. కానీ, టీ20 వరల్డ్‌ కప్‌ మాత్రం అస్సలు మిస్‌ కావద్దని కోరుకుంటున్నారు. అయితే.. ఒక్క టీ20 వరల్డ్‌ కపే కాదు.. ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ ఏంటో ఒకసారి చూద్దాం..

  • జనవరి 11 నుంచి 17 వరకు ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌
  • ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌..
    జనవరి 25 నుంచి 29 వరకు.. హైదరాబాద్‌లో తొలి టెస్ట్‌
    ఫిబ్రవరి 2-6 వరకు.. విశాఖపట్నంలో రెండో టెస్ట్‌
    ఫిబ్రవరి 15-19 వరకు.. రాజ్‌కోట్‌లో మూడో టెస్ట్‌
    ఫిబ్రవరి 23-27 వరకు.. రాంచీలో నాలుగో టెస్ట్‌
    మార్చి 7-11 వరకు.. ధర్మశాలలో ఐదో టెస్ట్‌
  • ఏప్రిల్‌-మే నెలల్లో ఐపీఎల్‌
  • జూన్‌లో వెస్టిండీస్‌, యూఏఈ వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌
  • జులైలో శ్రీలంక పర్యటన.. మూడు వన్డేలు, మూడు టీ20లు
  • సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో మనదేశంలోనే రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌
  • నవంబర్‌, డిసెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌.. ఐదు టెస్టుల సిరీస్‌.
Show comments