SNP
Ravindra Jadeja, Bhuvneshwar Kumar: ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకు ఘోర అవమానం జరిగింది. దానికి కారణం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చేద్దాం..
Ravindra Jadeja, Bhuvneshwar Kumar: ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకు ఘోర అవమానం జరిగింది. దానికి కారణం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చేద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన గ్రాండ్ విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. డామినేటింగ్ విక్టరీ సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హోం టీమ్ ఎస్‌ఆర్‌హెచ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. సీఎస్‌కే బ్యాటర్ జడేజాను బాల్‌తో కొట్టాడు. ఇందులో భువీ తప్పు ఏం లేదు. జడేజాదే తప్పు. నిజానికి జడేజా అక్కడ అవుట్ కావాల్సింది. కానీ, ఎస్‌ఆర్‌హెచ్ జడేజాను కావాలనే అవుట్ చేయలేదనే టాక్ వినిపిస్తోంది. కావాలనే అవుట్ చేయలేదు అంటే.. ఫిక్సింగ్ అనుకునేరు.. అలా కాదు. అసలు విషయం తెలిస్తే.. ఇది జడేజాకు ఘోర అవమానం అంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
చెన్నై బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసేందుకు వచ్చాడు. క్రీజ్‌లో జడేజా ఉన్నాడు. ఆ ఓవర్ తొలి మూడు బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో నాలుగో బంతికి భారీ షాట్ ఆడాలని ఫిక్స్ అయ్యాడు జడేజా. ఎంతో అనుభవం ఉన్న భువీ.. నాలుగో బంతిని సూపర్ యార్కర్‌గా వేశాడు. ఆ బాల్‌ను సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు జడేజా.. ఆ బాల్ బ్యాట్, కాలికి తగిలి.. భువీ చేతుల్లోకి వచ్చింది. అది సరిగ్గా గమనించని జడేజా రన్ కోసం కాస్త ముందుకు వచ్చేశాడు. వెంటనే బాల్ అందుకున్న భువీ.. స్ట్రైకర్ ఎండ్ వికెట్లకు త్రో కొట్టాడు. అది గమనించి జడేజా వెనక్కి తిరిగి స్టంప్స్‌కు అడ్డుగా పరిగెత్తాడు. దీంతో.. బాల్ అతని ముడ్డిపై తాకింది. త్రోకు ఉద్దేశపూర్వకంగా జడేజా అడ్డువచ్చాడని ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లు అపీల్ చేసి ఉంటే.. జడేజా అవుట్ అయి ఉండేవాడు. కానీ, ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దాని కోసం అపీల్ చేయకుండా జడేజాను కొనసాగనిచ్చాడు.
కమిన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జడేజా అవుట్ అయితే ధోని క్రీజ్‌లోకి వస్తాడని, ధోని బ్యాటింగ్‌కి రాకుండా చేయాలనే ఉద్దేశంతో జడేజాను అవుట్ చేయకుండా వదిలేశాడని కొంతమంది అంటుంటే.. జిడ్డు బ్యాటింగ్ చేస్తున్న జడేజాను అవుట్ చేయడం వేస్ట్ అని, అతను క్రీజ్‌లో ఉంటే తమకే మేలని భావించి జడేజా అవుట్ కోసం కమిన్స్ అపీల్ చేయలేదని మరికొంతమంది అంటున్నారు. కమిన్స్ ఉద్దేశం ఏదైనా.. జడేజాను అవుట్ చేయకుండా వదిలేయడం అతన్ని అవమానించడమే అవుతుంది. గల్లీ క్రికెట్‌లో బాల్స్ మింగుతూ.. రన్స్ చేయని బ్యాటర్‌ను ప్రత్యర్థి టీమ్ అవుట్ చేయదు. అదే గల్లీ రూల్‌ను ఇక్కడ జడేజా విషయంలో కూడా కమిన్స్ ఫాలో అయ్యాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pat Cummins don’t want MS Dhoni to arrive early and want Jadeja to struggle till the end 😨
That’s some Mastermind call from @patcummins30 👏#CSKvsSRH #AbhishekSharma #SRHvsCSK #CSKvSRH pic.twitter.com/EXSvXvrWVM
— Richard Kettleborough (@RichKettle07) April 5, 2024