Brian Lara Said Shubman Gill Will Rule The World: కోహ్లీలా అతడు క్రికెట్​ను ఏలుతాడు.. ఆ భారత బ్యాటర్​దే ఇక పెత్తనం: లారా

Brian Lara: కోహ్లీలా అతడు క్రికెట్​ను ఏలుతాడు.. ఆ భారత బ్యాటర్​దే ఇక పెత్తనం: లారా

భారత జట్టులోని ఓ ఆటగాడిపై వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా ప్రశంసల జల్లులు కురిపించాడు. అతడు క్రికెట్​లోని అన్ని రికార్డులు తుడిచి పెట్టేస్తాడని అన్నాడు.

భారత జట్టులోని ఓ ఆటగాడిపై వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా ప్రశంసల జల్లులు కురిపించాడు. అతడు క్రికెట్​లోని అన్ని రికార్డులు తుడిచి పెట్టేస్తాడని అన్నాడు.

టీమిండియా లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్​తో వీళ్లు ఆ ఫార్మాట్​కు గుడ్​బై చెప్పేశారు. దీంతో ఇక మీదట వన్డేలు, టెస్టుల్లో మాత్రమే ఈ ఛాంపియన్ ప్లేయర్స్​ను చూడగలం. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో ఈ ఇద్దరు స్టార్లు వన్డేల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కేవలం టెస్టుల్లో ఆడుతూ మరికొన్నాళ్లు యంగ్​స్టర్స్​కు సపోర్ట్​గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రోకో జోడీ వారసత్వాన్ని ఎవరు అందుకుంటారు? ముఖ్యంగా రన్ మెషీన్ కోహ్లీలా ఎవరు ఇంటర్నేషనల్ క్రికెట్​లో డామినేట్ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా రియాక్ట్ అయ్యాడు.

కోహ్లీకి సరైన వారసుడు యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ అని లారా అన్నాడు. విరాట్ మాదిరిగా వచ్చే దశాబ్దం అతడు ప్రపంచ క్రికెట్​ను ఏలుతాడని చెప్పాడు. అతడి దెబ్బకు అన్ని రికార్డులు బద్దలు అవడం ఖాయమన్నాడు లారా. ‘ప్రస్తుత తరంలో మోస్ట్ టాలెంటెడ్ బ్యాటర్లలో మొదటి వరుసలో ఉంటాడు శుబ్​మన్ గిల్. అతడి బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతం. వచ్చే కొన్నేళ్ల పాటు వరల్డ్ క్రికెట్​ను అతడు రూల్ చేస్తాడు. అతడి మీద నాకు చాలా నమ్మకం ఉంది. క్రికెట్​లోని ఎన్నో బిగ్ రికార్డ్స్​ను అతడు బ్రేక్ చేయడం ఖాయం’ అని లారా చెప్పుకొచ్చాడు. శుబ్​మన్​తో పాటు మరో భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మీద కూడా లారా ప్రశంసల జల్లులు కురిపించాడు.

ఎంతో క్లిష్టమైన తన ‘400’ రికార్డును కొట్టే సత్తా గిల్-జైస్వాల్​కు మాత్రమే ఉందన్నాడు లారా. వీళ్లిద్దరూ ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాళ్లని మెచ్చుకున్నాడు. ‘గిల్-జైస్వాల్​కు సమయం కలిసొచ్చి క్రీజులో నిలదొక్కుకుంటే నా రికార్డును అధిగమించగలరు. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్​లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, సనత్ జయసూర్య, ఇంజమాముల్ హక్ లాంటి అటాకింగ్ ప్లేయర్లు ఉండేవారు. వాళ్లు నా 400 రికార్డును బ్రేక్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కనీసం 300 మార్క్​ను అందుకున్నా చాలని అనుకున్నారు. కానీ ఇప్పుడా సిచ్యువేషన్ లేదు. రియల్ టెస్ట్ లాంటి లాంగ్ ఫార్మాట్​లో దూకుడుగా ఆడే బ్యాటర్లు కనిపించడం లేదు. భారత జట్టులో గిల్-జైస్వాల్ రూపంలో ఇద్దరు సాలిడ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్లకు నా రికార్డును బద్దలు కొట్టే సత్తా ఉంది’ అని లారా చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీలా గిల్ క్రికెట్​ను శాసిస్తాడంటూ లారా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments