రోహిత్ శర్మ.. ధోనీలా ఒత్తిడి తట్టుకోలేడు! అక్తర్ షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 09:17 PM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Published - 09:17 PM, Sat - 19 August 23
రోహిత్ శర్మ.. ధోనీలా ఒత్తిడి తట్టుకోలేడు! అక్తర్ షాకింగ్ కామెంట్స్

మరికొన్ని రోజుల్లో క్రికెట్ విశ్వ సమరానికి తెర లేవనుంది. ఈ క్రమంలోనే దిగ్గజాలు, క్రీడా పండితులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు. ఏఏ జట్లు సెమీస్ కు వెళ్తాయో, ఏ జట్లు ఫైనల్లో ఆడతాయో జోస్యం చెప్పడం ఇప్పటికే ప్రారంభించారు. ఇక ఇతర టీమ్స్ బలాలు, బలహీనతలపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు పలువురు దిగ్గజ క్రికెటర్స్. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై షాకింగ్ కామెంట్స్ చేశాడు పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్. రోహిత్ శర్మ మంచి బ్యాటర్ అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో ఒత్తిడిని జయించడం రోహిత్ వల్ల కాదు.. అంటూ కామెంట్స్ చేశాడు అక్తర్.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్. “అప్పట్లో టీమిండియాలో ఒకడుండేవాడు.. అతడే జట్టు ఒత్తిడి అంతా భరించి.. మిగతా ఆటగాళ్లను రిలాక్స్ గా ఉంచేవాడు. అతడు మరెవరో కాదు మహేంద్రసింగ్ ధోని. అప్పట్లో టీమిండియా జట్టు మెుత్తం అతడి వెనకే ఉండేది. ధోనినే జట్టు భారాన్ని అంతా మోసేవాడు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత ధోని సొంతం. ఇక ధోనిలా వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో ఒత్తిడి జయించడం రోహిత్ శర్మ వల్ల కాదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ దాయాది మాజీ బౌలర్.

అయితే రోహిత్ శర్మ మంచి బ్యాటరే అని కితాబిచ్చాడు అక్తర్. అతడు కోహ్లీ కంటే బెటర్ షాట్స్ ఆడతాడని, కానీ కెప్టెన్ అయిన తర్వాత ఆందోళనకు గురౌతున్నాడు, భయపడిపోతున్నాడు అంటూ రోహిత్ టార్గెట్ చేస్తూ.. మాట్లాడాడు. రోహిత్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టకపోయి ఉంటేనే బాగుండేదని అక్తర్ పేర్కొన్నాడు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్ ఒత్తిడిని జయించలేడు, రోహిత్ ఇదే ప్రశ్నను తననుతాను ప్రశ్నించుకోవాలని రెవ్ స్పోర్ట్స్ తో మాట్లాడిన సందర్భంలో వ్యాఖ్యానించాడు. మరి షోయబ్ అక్తర్ రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఇలాంటి క్యాచ్ మీరెప్పుడూ చూసుండరు! వైరల్ వీడియో..

Show comments