Virat Kohli: విరాట్‌ కోహ్లీని కాపాడిన దూబే, పంత్‌! లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదే!

Virat Kohli: విరాట్‌ కోహ్లీని కాపాడిన దూబే, పంత్‌! లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదే!

Shivam Dube, Rishabh Pant, Virat Kohli, Victory Parade: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ విషయంలో యువ క్రికెటర్లు శివమ్‌ దూబే, రిషభ్‌ పంత్‌ చాకచక్యంగా వ్యవహరించారు. లేదంటే కోహ్లీకి ప్రమాదం జరిగి ఉండేది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Shivam Dube, Rishabh Pant, Virat Kohli, Victory Parade: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ విషయంలో యువ క్రికెటర్లు శివమ్‌ దూబే, రిషభ్‌ పంత్‌ చాకచక్యంగా వ్యవహరించారు. లేదంటే కోహ్లీకి ప్రమాదం జరిగి ఉండేది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టుపై గత వారం రోజులుగా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. జూన్‌ 29న వెస్టిండీస్‌లోని బార్బోడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్‌ సేన.. సగర్వంగా టీమిండియా వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. కాస్త ఆలస్యంగా గురువారం స్వదేశానికి చేరుకున్న ఛాంపియన్‌ టీమ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. తొలుత ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో దిగిన టీమిండియాకు క్రికెట్‌ అభిమానులు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఆ తర్వాత ప్రధానితో మర్యాదపూర్వక భేటీ తర్వాత.. ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్‌ నిర్వహించింది. ఈ పరేడ్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లీకి ప్రమాదం తప్పింది.

టీమిండియా యువ క్రికెటర్లు శివమ్‌ దూబే, రిషభ్‌ పంత్‌ సమయస్ఫూర్తితో కోహ్లీకి పెద్ద ప్రమాదం తప్పింది. అదేంటంటే.. టీమిండియా విక్టరీ పరేడ్‌ కోసం ముంబైలోని క్రికెట్‌ అభిమానులు భారీగా మెరైన్‌ డ్రైవ్‌ వద్దకు చేరుకున్నారు. కొన్ని వేల మంది అభిమానులతో ముంబై తీరం జనసంద్రంగా మారింది. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న వరల్డ్‌ కప్‌ గెలవడం, తమపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయిన కోహ్లీ.. కాస్త జోష్‌లోకి వచ్చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీని అభిమానులకు చూపించే క్రమంలో.. బస్‌ ఎడ్జ్‌ ఎక్కబోయాడు.

ఓపెన్‌ టాప్‌ బస్‌లో టీమిండియా క్రికెటర్లు విక్టరీ పరేడ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ ఉత్సాహంగా ట్రోఫీని అభిమానులకు చూపే క్రమంలో కోహ్లీ బస్‌ టాప్‌పై కాలు పెట్టేశాడు. పక్కనే ఉన్న రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే కోహ్లీ కాళ్లను పట్టుకుని.. కాస్త తట్టి బస్‌ ఎడ్జ్‌పై ఉన్నాం అనే విషయం కోహ్లీకి తెలిసేలా చేశారు. వాళ్లు గమనించి కోహ్లీ కాళ్లు పట్టుకుని ఆపకపోయి ఉంటే.. అదే జోస్‌లో కోహ్లీ ఆ ఎడ్జ్‌ ఎక్కి.. బస్‌ నుంచి కింద పడి ఉండేవాడంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. కోహ్లీని గమనిస్తూ.. అతన్ని కాపాడిన దూబే, పంత్‌కు కోహ్లీ ఫ్యాన్స్‌ థ్యాంక్స్‌ చెబుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments