ఇలాంటి క్యాచ్ మీరెప్పుడూ చూసుండరు! వైరల్ వీడియో..

  • Author Soma Sekhar Published - 07:47 PM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Published - 07:47 PM, Sat - 19 August 23
ఇలాంటి క్యాచ్ మీరెప్పుడూ చూసుండరు! వైరల్ వీడియో..

క్రికెట్ చరిత్రలో మీరు చిత్ర విచిత్రమైనా క్యాచ్ లు చూసుంటారు. అలాగే అతి భయంకరమైన విన్యాసం చేస్తూ.. గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టే క్యాచ్ లను సైతం చూసుంటారు. కానీ న్యూజిలాండ్ ఆటగాడు పట్టిన క్యాచ్ మాత్రం క్రికెట్ హిస్టరీలోనే బెస్ట్ క్యాచ్ అని చెప్పొచ్చు. అదీకాక ఈ క్యాచ్ కాట్ అండ్ బౌల్ కావడం గమనార్హం. యూఏఈ తో జరుగుతున్న 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. తొలి టీ20లో ఈ అద్భుతమైన క్యాచ్ చోటుచేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ సాంట్నర్ ఈ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ను అందుకున్నాడు. ప్రస్తుతం అతడు క్యాచ్ అందుకున్న వీడియో వైరల్ గా మారింది.

మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం న్యూజిలాండ్ యూఏఈలో పర్యటిస్తోంది. ఈ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో ఆతిథ్య యూఏఈపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జట్టులో సైఫర్ట్ (55) నీషమ్ (25), మెకంచీ (31) పరుగులతో రాణించారు. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 19.4 ఓవర్లకు 136 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (60) పరుగులతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. కివీస్ బౌలర్లలో కెప్టెన్ టీమ్ సౌథీ 5 వికెట్లతో యూఏఈ పతనాన్ని శాసించాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ నమోదు అయ్యింది. అసలు ఆ క్యాచ్ ఎవరు పడతారులే అనుకున్న తరుణంలో.. అద్భుతమైన డైవింగ్ తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు కివీస్ ఆల్ రౌండర్ సాంట్నర్. ఈ బెస్ట్ క్యాచ్ యూఏఈ ఇన్నింగ్స్ 6వ ఓవర్ లో నమోదైంది. యూఏఈ బ్యాటర్ ఆసిఫ్ ఖాన్ బ్యాటింగ్ చేస్తుండగా.. సాంట్నర్ చేసిన బంతిని స్ట్రైట్ గా ఆడాడు. ఆ బాల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ కు కొద్దిగా అవతలే పడింది. ఇక ఈ బాల్ ను బౌలర్ అందుకోలేడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా కివీస్ బౌలర్ గాల్లోకి డైవ్ చేస్తూ.. క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఆశ్చర్యపోవడం బ్యాటర్ వంతైంది. ఇక ఈ క్యాచ్ క్రికెట్ హిస్టరీలోనే బెస్ట్ క్యాచ్ గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరి ఈ అద్భుతమైన క్యాచ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: నిప్పులపై నడిచిన స్టార్‌ క్రికెటర్‌! ఎందుకో తెలుసా?

Show comments