Nidhan
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ పూర్తవడంతో భవిష్యత్ ప్రణాళికల్లో మునిగిపోయాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ పూర్తవడంతో భవిష్యత్ ప్రణాళికల్లో మునిగిపోయాడు.
Nidhan
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ పూర్తవడంతో భవిష్యత్ ప్రణాళికల్లో మునిగిపోయాడు. రోడ్డు ప్రమాదం కారణంగా రెండేళ్లు క్రికెట్‌కు దూరమైన ఈ స్టార్ ప్లేయర్.. కమ్‌బ్యాక్‌లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో కీపర్‌గా, బ్యాటర్‌గా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పొట్టి ప్రపంచ కప్‌లోనూ కీలక మ్యాచుల్లో సత్తా చాటాడు. భారత్ కప్పు గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన పంత్.. మెగాటోర్నీ ముగించుకొని స్వదేశానికి వచ్చాడు. అనంతరం విక్టరీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. అలాగే అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకూ హాజరయ్యాడు పంత్.
ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు పంత్. వన్డేతో పాటు టీ20 జట్టుకు కూడా సెలెక్ట్ అయిన ఈ స్టైలిష్ ప్లేయర్ అదరగొట్టాలని ఫిక్స్ అయ్యాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో టీమ్‌లో తన ప్లేస్ ఫిక్స్ చేసుకునేందుకు ఈ వన్డే సిరీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. హిట్టింగ్ ఎబిలిటీస్‌తో పాటు డిఫెన్సివ్ అప్రోచ్‌ను కూడా మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాడు. కొత్త కోచ్ గంభీర్ లెఫ్టాండర్ కాబట్టి అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అభిమానులకు పంత్ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ప్లీజ్ సాయం చేయమని కోరాడు. అతడు కోరింది తన కోసం కాదు.. ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ఆటగాళ్ల గురించి కావడం గమనార్హం.
పారిస్ ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. ఈసారి దేశానికి మరిన్ని మెడల్స్ అందించాలని తహతహలాడుతున్నారు. బోలెడన్ని బంగారు పతాకలు సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలవాలని, ఎంకరేజ్ చేయాలని కోరాడు పంత్. దేశం కోసం అహర్నిషలు శ్రమిస్తున్న అథ్లెట్లకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని, ఈ పోరాటంలో వారికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశాడు. అందరూ కలసికట్టుగా సపోర్ట్ చేయాలని.. అథ్లెట్లకు ఇది ఎంతో ధైర్యాన్ని ఇస్తుందన్నాడు. ఇక, పంత్ కంటే ముందు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు. వాళ్ల కోసం అందరమూ ఒక్కటవుదామని, ఎంకరేజ్ చేయాలని పిలుపునిచ్చాడు.
May the tricolor fly high at Paris
Wishing our Indian Olympic athletes all the best for Paris 2024. 🇮🇳#RP17 pic.twitter.com/aeqsFu0r4w— Rishabh Pant (@RishabhPant17) July 22, 2024