RCB vs KKR: హీరో కాస్త విలన్‌ అయ్యాడు! DK వల్లే మ్యాచ్‌ పోయిందా?

Dinesh Karthik, RCB vs KKR: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ ఓటమికి దినేష్‌ కార్తీక్‌ కారణం అంటూ కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Dinesh Karthik, RCB vs KKR: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ ఓటమికి దినేష్‌ కార్తీక్‌ కారణం అంటూ కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించింది. ఆదివారం కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఒక్క పరుగు తేడాతో థ్రల్లింగ్‌ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి.. 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది కేకేఆర్‌.. ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 20 ఓవర్లలో 221 పరుగులు చేసి.. ఒక్క రన్‌ తేడాతో ఓటమి పాలైంది ఆర్సీబీ. దురదృష్టవశాత్తు విరాట్‌ కోహ్లీ 18 పరుగులు మాత్రమే చేసి అవుటైనా.. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కూడా వెంటనే వికెట్‌ ఇచ్చేసినా.. విల్‌ జాక్స్‌, రజత్‌ పాటిదార్‌ అద్భుత పోరాటానికి తోడు చివర్లలో కరణ్‌ శర్మ మెరుపులతో విజయం ముంగిట్లో నిలిచిన ఆర్సీబీ.. విచిత్రంగా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 పరుగులు చేసిన దినేష్‌ కార్తీక్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకు అంతా ఆర్సీబీదే విజయం అనుకున్నారు. కానీ, తీరా మ్యాచ్‌ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమికి కారణం డీకేనే అంటున్నారు. అది ఎలాగో? ఎందుకో? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

223 పరుగుల భారీ టార్గెట్‌ ఛేజ్‌ చేసే క్రమంలో ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌ మెరుపు ఆరంభాన్ని అందించారు. 2 ఓవర్లలోనే 27 పరుగులు బాదేశారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ రెండు సిక్సులు ఒక ఫోర్‌తో 6 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. కానీ, మూడో ఓవర్‌ తొలి బంతికే కోహ్లీ అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే డుప్లెసిస్‌ కూడా అవుట్‌ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. కానీ, విల్‌ జాక్స్‌ 32 బంతుల్లో 55, రజత్‌ పాటిదార్‌ 23 బంతుల్లో 52 పరుగులతో ఆర్సీబీని గేమ్‌లోకి తీసుకొచ్చారు. కానీ, వీరిద్దరు కూడా వెంటవెంటనే అవుట్‌ అవ్వడంతో మ్యాచ్‌ మళ్లీ కేకేఆర్‌ వైపు మళ్లింది. కానీ, సుయాష్‌ ప్రభుదేశాయ్‌ 18 బంతుల్లో 24, డీకే 18 బంతుల్లో 25 రన్స్‌ చేసి.. మ్యాచ్‌పై ఆశలు చిగురింపజేశారు. చివరి నాలుగు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 42 పరుగులు కావాలి. ఇది అంత కష్టమైన ఇక్వేషన్‌ కాదు. పైగా క్రీజ్‌లో దినేష్‌ కార్తీక్‌ ఉన్నాడు. దీంతో ఆర్సీబీదే విజయం అని అంతా ఫిక్స్‌ అయ్యారు. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ ఓవర్‌లో, అలాగే 18వ ఓవర్‌లో డీకే మరి డిఫెన్సివ్‌గా ఆడాడు.

ఇక చివరి 12 బంతుల్లో 31 పరుగులు అవసరమైన సమయంలో.. మరో ఎండ్‌లో ఉన్న కరణ్‌ శర్మకు స్ట్రైక్‌ ఇవ్వకుండా డీకేనే మొత్తం ఓవర్‌ ఆడాడు. తొలి రెండు బంతుల్లో సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా.. డీకే రన్‌కు వెళ్లలేదు. ఆ ఓవర్‌లో ఓ సిక్స్‌, ఓ ఫోర్‌తో 5 బంతుల్లో 10 రన్స్‌ డీకే చివరి బాల్‌కు అవుట్‌ అయ్యాడు. చివరి ఓవర్‌లో 21 రన్స్‌ అవసరమైన సమయంలో కరణ్‌ శర్మ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో మూడు సిక్సులు బాది అవుట్‌ అయ్యాడు. దీంతో ఆర్సీబీ ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే.. బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం ఉన్న ఆల్‌రౌండర్‌ కరణ్‌ శర్మకు 19వ ఓవర్‌లో డీకే స్ట్రైక్‌ ఎందుకు ఇవ్వలేదో ఎవరికీ అర్థం కాలేదు. ఆ ఓవర్‌లో కూడా కరణ్‌కు స్ట్రైక్‌ ఇచ్చి ఉంటే.. ఒకటి రెండు హిట్స్‌ వచ్చి ఉండేవని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. కానీ, డీకే మాత్రం కరణ్‌కు స్ట్రైక్‌ ఇవ్వకుండా తప్పు చేశాడని, అదే ఆర్సీబీ ఓటమికి కారణం అయిందంటూ మండిపడుతున్నారు. అలాగే 17, 18వ ఓవర్లలో డీకే మరి డిఫెన్సీవ్‌గా ఆడి.. 5, 6 రన్స్‌ మాత్రమే ఆయా ఓవర్స్‌ వచ్చాయని, అది కూడా చివర్లో తీవ్ర ఒత్తిడి పెంచిందని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments