Rahul Dravid: కోచ్ పదవికి ద్రవిడ్ మళ్లీ అప్లై చేసుకోవడం కష్టమేనా? కోచ్‌గా అదే ద్రావిడ్‌ లాస్ట్‌ డే నా?

టీమిండియాకు కొత్త కొచ్ కోసం ప్రకటన ఇస్తామని, ఇందుకు ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చని జైషా పేర్కొన్నాడు. అయితే ద్రవిడ్ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటాడు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టీమిండియాకు కొత్త కొచ్ కోసం ప్రకటన ఇస్తామని, ఇందుకు ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చని జైషా పేర్కొన్నాడు. అయితే ద్రవిడ్ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటాడు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టీమిండియాకు కొత్త కొచ్ వస్తున్నాడా? అంటే అవుననే సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం మరికొంత కాలం కొనసాగే ఛాన్స్ లను కూడా కొట్టిపారేయలేం అంటున్నారు క్రీడా పండితులు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. టీమిండియాకు కొత్త కొచ్ కోసం ప్రకటన ఇస్తామని, ఇందుకు ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చని జైషా పేర్కొన్నాడు. అయితే ద్రవిడ్ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటాడు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాహుల్ ద్రవిడ్ నవంబర్ 2021 నుంచి 2023 వరకు టీమిండియాకు కోచ్ గా ఉన్నాడు. అయితే అతడి పదవీ కాలం ముగిసినా కానీ.. టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ద్రవిడ్ పదవిని పొడిగించింది. దీంతో ఈ పొట్టి వరల్డ్ కప్ ముగిసే వరకు అతడే కోచ్ గా ఉంటాడు. అయితే అతడి తర్వాత భారత్ కు నెక్ట్స్ కోచ్ ఎవరు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జైషా తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. కోచ్ పదవికి ద్రవిడ్ మళ్లీ అప్లై చేసుకునే అవకాశాలు లేవని నివేదికలు చెబుతున్నాయి. జాతీయ మీడియా సంస్థల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ద్రవిడ్ మళ్లీ కోచ్ గా కొనసాగేందుకు ఇష్టంగా లేడట. దాంతో భారత జట్టుకు కొత్త కోచ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ఇదే జరిగితే ఈ వరల్డ్ కప్ లోనే కోచ్ గా ద్రవిడ్ కి లాస్ట్ డే అవుతుంది. ఇదిలా ఉండగా.. టీమిండియాకు ఫారిన్ కోచ్ వస్తాడా? లేక ఇండియనే వస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. అయితే.. ముగ్గురు టీమిండియా దిగ్గజాలను ఈ కోచ్ పదవి కోసం బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వారిలో సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలు ఉన్నారు. అన్నీ కుదిరితే.. వీరిలో ఒక్కరు భారత జట్టుకు కొత్త కోచ్ అవుతారు. మరి టీమిండియాకు కొత్త కోచ్ ఎవరైతే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments