కోహ్లీని రెచ్చగొట్టిన సౌతాఫ్రికా బౌలర్.. తన స్టైల్​లో ఇచ్చిపడేసిన విరాట్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాంద్రే బర్గర్ స్లెడ్జింగ్ కు దిగాడు. తనను రెచ్చగొట్టిన సౌతాఫ్రికా బౌలర్ కు కోహ్లీ బ్యాటుతోనే సమాధానం చెప్పారు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాంద్రే బర్గర్ స్లెడ్జింగ్ కు దిగాడు. తనను రెచ్చగొట్టిన సౌతాఫ్రికా బౌలర్ కు కోహ్లీ బ్యాటుతోనే సమాధానం చెప్పారు.

దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో సఫారీల బౌలర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాంద్రే బర్గర్ స్లెడ్జింగ్ కు దిగాడు. కోహ్లీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ విరాట్ తనదైన స్టైల్లో బర్గర్ కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాడు. మాటలతో కాదు చేతలతోనే సమాధానం చెప్పి కింగ్ రేంజ్ ఏంటో తెలిసేలా చేశాడు. బర్గర్ బౌలింగ్ లో సిక్సులు, ఫోర్లతో కోహ్లీ విరుచుకుపడ్డాడు. కోహ్లీతోనే ఆటలా అంటూ బర్గర్ ను ఉద్దేశిస్తూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

14.2 ఓవర్లో రోహిత్ ఔట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. విరాట్ క్రీజులోకి వచ్చేసరికి దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాంద్రే బర్గర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బర్గర్ వేసిన బంతిని డిఫెండ్ చేశాడు. ఆ బంతి బర్గర్ చేతికి చేరుకుంది. ఆ తర్వాత బర్గర్ బంతిని పట్టుకుని విరాట్ వైపు విసిరేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో కోహ్లి అతడిని చూస్తూ నిలబడిపోయాడు. తొలి బంతి వేసిన తర్వాత బర్గర్ మైదానంలో దూకుడు ప్రదర్శిస్తూ కనిపించాడు. తొలి బంతికి డిఫెండ్ చేసిన కోహ్లి 14వ ఓవర్‌లో బెర్గర్ వేసిన తర్వాతి బంతుల్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. తనను రెచ్చగొట్టిన సౌతాఫ్రికా బౌలర్ కు కోహ్లీ బ్యాటుతోనే సమాధానం చెప్పారు.

కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టులో పరాజయంపాలైన టీమిండియా ప్రతీకారం తీర్చుకునేందుకు బరిలోకి దిగింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారత్ ను బౌలింగ్ కు ఆహ్వానించింది. భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో సఫారీల టాపార్డర్ ను కుప్పకూల్చారు. 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. మహమ్మద్ సిరాజ్ (15/6) ధాటికి భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 23.2 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన టీమ్ ఇండియా తడబడింది. 34.5 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం సఫారీల జట్టు సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతోంది. 14 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

Show comments