ఉత్తరప్రదేశ్ కు చెందిన షమీ.. దేశవాళీ క్రికెట్ మాత్రం బెంగాల్ తరపున ఆడాడు. ఇలా ఆడటానికి కారణం ఏంటని షమీని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. షాకింగ్ విషయాలు పంచుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన షమీ.. దేశవాళీ క్రికెట్ మాత్రం బెంగాల్ తరపున ఆడాడు. ఇలా ఆడటానికి కారణం ఏంటని షమీని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. షాకింగ్ విషయాలు పంచుకున్నాడు.
మహ్మద్ షమీ.. వరల్డ్ కప్ లో ఎన్నో సంచలనాలను సృష్టించాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో ఆడింది 7 మ్యాచ్ లే అయినప్పటికీ.. 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇక ఈ మెగాటోర్నీలో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాడు షమీ. 48 ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అదీకాక వరల్డ్ కప్ లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహ్మద్ షమీ పలు షాకింగ్ విషయాలను వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన షమీ.. దేశవాళీ క్రికెట్ మాత్రం బెంగాల్ తరపున ఆడాడు. ఇలా ఆడటానికి కారణం ఏంటని షమీని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
వరల్డ్ కప్ లో సంచలన ప్రదర్శనతో అందరి ప్రశంసలు పొందాడు మహ్మద్ షమీ. చిచ్చరపిడుగులా ఈ టోర్నీలో చెలరేగి.. ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టాడు. కానీ టీమిండియాకు మాత్రం వరల్డ్ కప్ అందించడంలో విఫలం అయ్యాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహ్మద్ షమీ తన దేశవాళీ క్రికెట్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. యూపీకి చెందిన షమీ.. సొంత రాష్ట్రం తరఫున డొమెస్టిక్ కెరీర్ ఆడకుండా బెంగాల్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఎందుకు ఆడారు? అని ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. షాకింగ్ విషయాలను వెల్లడించాడు.
షమీ మాట్లాడుతూ..”నా స్వరాష్ట్రం యూపీ నుంచి కాకుండా బెంగాల్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాను. దానికి బలమైన కారణం ఉంది. యూపీ క్రికెట్ బోర్డులో ఉన్న రాజకీయాల వల్లే నేను బెంగాల్ కు మారాను. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. రెండేళ్ల పాటు జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టేశారు. నా సెలెక్షన్ గురించి మా అన్నయ్య యూపీ చీఫ్ సెలెక్టర్ ను కలిస్తే.. నేను ఈ పదవిలో ఉన్నంత వరకు అతడిని సెలెక్ట్ చేయనని మా అన్నయ్యతో చెప్పాడు” అంటూ యూపీ క్రికెట్ బోర్డులో ఉన్న రాజకీయాల గురించి చెప్పుకొచ్చాడు.
కాగా.. చీఫ్ సెలక్టర్ పదవి కోల్పోయేలా చేసే పవర్ మా అన్నయ్యకు ఉన్నా కూడా అతడిని వదిలేశాడని షమీ తెలిపాడు. ఈ పరిణామాల తర్వాత 14 ఏళ్ల వయసులోనే బెంగాల్ క్రికెట్ లో భాగమైయ్యాడు షమీ. ఒక విధంగా షమీకి ఇది మంచే అని చెప్పాలి. బెంగాల్ కు ఆడుతున్న కాలంలోనే గంగూలీ కంట్లో పడ్డాడు షమీ. అక్కడి నుంచి అతడి కెరీర్ మలుపుతిరిగింది. ప్రస్తుతం షమీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి యూపీ జట్టుకు ఆడకపోవడానికి రాజకీయాలే కారణం అన్న షమీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.