P Venkatesh
ఆసిస్ స్టార్ ప్లేయర్ అభిమానికి ఇచ్చిన మాట ప్రకారం ఆశ్చర్యకరమైన బహుమతిని అందించి అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్టులో పాక్ ను ఆలౌట్ చేస్తే షూస్ ఇస్తానని ప్రామిస్ చేశాడు స్టార్క్.
ఆసిస్ స్టార్ ప్లేయర్ అభిమానికి ఇచ్చిన మాట ప్రకారం ఆశ్చర్యకరమైన బహుమతిని అందించి అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్టులో పాక్ ను ఆలౌట్ చేస్తే షూస్ ఇస్తానని ప్రామిస్ చేశాడు స్టార్క్.
P Venkatesh
క్రికెట్ నేడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న క్రీడా. మ్యాచ్ జరుగుతుందంటే చాలు దూరంతో సంబంధం లేకుండా రెక్కులు కట్టుకుని మరీ వాలిపోతుంటారు. వయసుతో సంబంధం లేకుండా క్రికెట్ ను అంతగా ప్రేమిస్తారు. ఇక తమ అభిమాన క్రికెటర్ల పట్ల చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. గ్రౌండ్ లో క్రికెటర్లు ఫోర్లు, సిక్సర్స్, సెంచరీలతో దుమ్మురేపుతుంటే అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. కాగా క్రికెటర్స్ కూడా అప్పుడప్పుడు అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా ఆసిస్ స్టార్ ప్లేయర్ ఓ అభిమానికి ఇచ్చిన మాట ప్రకారం తన షూస్ ను బహూకరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా, పాక్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. మెల్బోర్న్లో ఆసిస్, పాకిస్తాన్ మద్య జరిగిన 2వ టెస్ట్ లో కంగారులు విజయం సాధించారు. 79 పరుగుల తేడాతో పాక్ ను మట్టి కరింపించి విక్టరీ కొట్టారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా లంచ్ విరామం సమయంలో చిన్నారి అభిమానికి మిచెల్ స్టార్క్ ఓ ప్రామిస్ చేశాడు. స్టార్క్ లంచ్ విరామం తర్వాత అభిమానికి ఒక రోజు ముగిసే సమయానికి జట్టు అన్ని వికెట్లు తీయగలిగితే తన బూట్లు బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశాడు.
మిచెల్ స్టార్క్ ప్రామిస్ చేసినట్టుగానే అభిమానికి షూస్ బహూకరించాడు. ఈ మ్యాచ్ లో పాక్ ను ఆలౌట్ చేసిన ఆసిస్ జట్టు మెల్ బోర్న్ లో విక్టరీ కొట్టింది. ఈ సందర్భంగా స్టార్క్ షూస్ ను బహుమతిగా ఇచ్చి అభిమానిలో సంతోషాన్ని నింపాడు. అంతేగాక అభిమానికి సెల్ఫీ కూడా ఇచ్చాడు. బాక్సింగ్ డే టెస్ట్ ముగిసిన తర్వాత స్టార్క్ తన బూట్లను ఒక పిల్లవాడికి అందజేస్తున్న వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్లో షేర్ చేసింది. ఆసిస్ దిగ్గజ పేసర్ నుంచి షూస్ అందుకోవడంతో ఆ చిన్నారి అభిమానిలో ఆనందం వెల్లువిరిసింది. ఇచ్చిన మాట ప్రకారం షూస్ ను అభిమానికి అందించిన స్టార్క్ పై క్రికెట్ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ను 79 పరుగుల తేడాతో ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కమిన్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ను 237 పరుగులకు ఆలౌట్ చేసింది. మిచెల్ స్టార్క్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా చెప్పుకోదగ్గ సహకారం అందించాడు. మరి అభిమానికి షూస్ ను బహుమతిగా ఇచ్చిన స్టర్క్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
At the end of lunch, Mitchell Starc promised this young fan he’d give him his boots if we took nine wickets by the end of the day.
We did, and Starcy delivered on his promise! ❤️ pic.twitter.com/grLhdxcPfm
— Cricket Australia (@CricketAus) December 29, 2023