వీడియో: విరాట్‌ కోహ్లీ ఎంత గొప్ప లీడర్‌ అంటే..! రాహుల్‌ చెప్పింది వింటే గుస్‌బమ్స్‌ పక్కా

KL Rahul, Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి తాజాగా కేఎల్‌ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. అతను చెప్పిన మాటలు వింటే క్రికెట్‌ అభిమానులకు గుస్‌బమ్స్‌ రావడం పక్కా. ఇంతకీ రాహుల్‌ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

KL Rahul, Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి తాజాగా కేఎల్‌ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. అతను చెప్పిన మాటలు వింటే క్రికెట్‌ అభిమానులకు గుస్‌బమ్స్‌ రావడం పక్కా. ఇంతకీ రాహుల్‌ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024లో టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు అదరగొడుతున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అలాగే కేఎల్‌ రాహుల్‌ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌లో అల్లాడిస్తున్నారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్‌లో ఈ ముగ్గురు క్రికెట్లు టాప్‌ ఫోర్‌లో ఉన్నారు. ఆ విషయం అటుంచితే.. తాజాగా కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ గురించి అద్భుతమైన మాటలు మాట్లాడాడు. ఈ నెల 18న తన పుట్టిన రోజును జరుపుకున్న కేఎల్‌ రాహుల్‌ ఆ సందర్భంగా టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లీ గురించి తన మనసులో మాటలను బయటపెట్టాడు.

కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ..‘నేను ఐపీఎల్‌లో తొలి సీజన్‌ ఆడిన సమయంలో విరాట్‌ కోహ్లీనే నా కెప్టెన్‌, కోహ్లీ ఎంతో గొప్ప ఆటగాడు. వయసులో నాతో సమానుడే అయినా.. అప్పటికే టీమిండియా తరఫున ఆడుతూ.. ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. దాంతో నేను కూడా అతన్ని ఆరాధిస్తాను. కోహ్లీ ఎంత గొప్ప లీడర్‌ అంటే.. అందరు తనలా ఆడొచ్చనే విస్వాశాన్ని కలిగిస్తాడు. మనం ఇప్పుడు చేస్తున్న దాని కంటే ఇంకా గొప్పగా చేయగలం అనే స్ఫూర్తిని నింపుతాడు. కోహ్లీ అసాధారణ ఆటగాడే కాదు, గొప్ప లీడర్‌ కూడా..’ అంటూ రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

విరాట్‌ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో రాహుల్‌ ఆడిన తొలి టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ టైమ్‌లో రాహుల్‌కు కోహ్లీ ఎంతగానో సపోర్ట్‌ చేశాడు. అలాగే ఒక ఆటగాడిగా, బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ ఎదిగాడంటే అందులో కోహ్లీ పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది. అలాగే టీమిండియాలోకి వచ్చిన తర్వాత కూడా విరాట్‌ కోహ్లీతో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ ఇద్దరూ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో చూపించిన ఫామ్‌ను రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లోనూ చూపించి, ఈ సారి కప్పు మిస్‌ కాకుండా కొట్టాలని ఇద్దరు బలంగా ఫిక్స్‌ అయిఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కోహ్లీ గురించి రాహుల్‌ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments