BCCI: IPL 2025 మెగా వేలానికి ముందు BCCIకి బిగ్ షాక్! ఫ్రాంచైజీల కొత్త డిమాండ్స్..

IPL 2025 మెగా వేలానికి ముందు BCCIకి బిగ్ షాక్! ఫ్రాంచైజీల కొత్త డిమాండ్స్..

17 సీజన్లను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించిన బీసీసీఐకి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే బిగ్ షాక్ తగిలింది. బీసీసీఐకి ఫ్రాంచైజీలు కొత్త డిమాండ్స్ పెట్టినట్లు సమాచారం.

17 సీజన్లను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించిన బీసీసీఐకి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే బిగ్ షాక్ తగిలింది. బీసీసీఐకి ఫ్రాంచైజీలు కొత్త డిమాండ్స్ పెట్టినట్లు సమాచారం.

IPL.. ప్రపంచ క్రికెట్ లీగుల్లో అత్యంత రిచ్ లీగ్. దాంతో ప్రతి ఒక్క ప్లేయర్ ఇందులో ఆడాలని కలలు కంటూ ఉంటాడు. ఈ టోర్నీలో ఆడితే డబ్బుకు డబ్బుతో పాటుగా పేరు కూడా వస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులోకి దూసుకొచ్చిన సంగతి తెలియనిది కాదు. ఇక గడిచిన 17 సీజన్లను ఎంతో దిగ్విజయంగా, ఎలాంటి సమస్యలు రాకుండా నిర్వహించింది బీసీసీఐ. 17 సీజన్లను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించిన బీసీసీఐకి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే బిగ్ షాక్ తగిలింది. బీసీసీఐకి ఫ్రాంచైజీలు కొత్త డిమాండ్స్ పెట్టినట్లు సమాచారం. ఆ డిమాండ్స్ ఏంటి? ఓసారి చూద్దాం పదండి.

ఐపీఎల్ 2025 మెగా టోర్నీ కోసం సన్నాహకాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ మెగా వేలానికి సంబంధించి నిబంధనలను రూపొందించడానికి బీసీసీఐ ఈ నెల చివరన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత వేలానికి సంబంధించిన రూల్స్ ను వెల్లడిస్తుంది మేనేజ్ మెంట్. అయితే వచ్చే సీజన్ కోసం ఫ్రాంచైజీలు కొన్ని డిమాండ్స్ బీసీసీఐ ముందు ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాత నిబంధనలనే కొనసాగిస్తారా? లేక రిటైన్ ప్రక్రియను తొలగిస్తారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వచ్చే సీజన్లో రిటెన్షన్ రూల్ మార్చాలని కొన్ని ఫ్రాంచైజీలు కొరాయి. అయితే ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో.. డిమాండ్ ను బీసీసీఐ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దాంతో బీసీసీఐకి కొత్త తలనొప్పులు తయ్యారు అయ్యాయి.

BCCIకి ఫ్రాంచైజీలు పెట్టిన డిమాండ్స్ ఇవే!

  • 8 మంది ప్లేయర్లను జట్టులో ఉంచుకోవడానికి అనుమతించాలని ఓ ఫ్రాంచైజీ కోరింది.
  • మరికొన్ని టీమ్స్ 5 నుంచి 7 మందిని రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరాయి.
  • RTM కార్డును ఉపయోగించుకోవడానికి అనుమతించాలని ఇంకో యాజమాన్యం కోరింది.
  • వేలంలో టీమ్స్ ఖర్చు పెట్టే మెుత్తం రూ. 100 కోట్ల నుంచి 125 కోట్లకు పెంచాలని కోరాయి.

ఈ డిమాండ్స్ తో పాటుగా మరికొన్ని డిమాండ్స్ ను కూడా బీసీసీఐ ముందు పెట్టాయి ఫ్రాంచైజీలు. దాంతో బీసీసీఐకి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ డిమాండ్స్ లో దేన్ని అమలు పరిచినా.. మిగతా ఫ్రాంచైజీల్లో ఏదో ఒక టీమ్ కు వ్యతిరేకంగా మారుతుంది. దాంతో మేనేజ్ మెంట్ కు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. మెగా వేలానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని బీసీసీఐ భావిస్తోంది.

Show comments