SNP
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. చివరి మూడు టెస్టులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించాడు. మరి ఆ జట్టు ఎలాంటి మార్పులు చేశారు? ఇంతకీ విరాట్ కోహ్లీ టీమ్‌లో ఉన్నాడా? లేడా? రాహుల్ తిరిగొచ్చాడా? అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. చివరి మూడు టెస్టులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించాడు. మరి ఆ జట్టు ఎలాంటి మార్పులు చేశారు? ఇంతకీ విరాట్ కోహ్లీ టీమ్‌లో ఉన్నాడా? లేడా? రాహుల్ తిరిగొచ్చాడా? అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
మొత్తం ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. చెరో మ్యాచ్ గెలిచి.. ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇక మిగిలిన చివరి మూడు టెస్టుల కోసం తాజాగా సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఈ నెల 15 నుంచి మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చి 11తో ఈ టెస్ట్ సిరీస్ ముగియనుంది. అయితే.. చివరి మూడు టెస్టులకు ప్రకటించిన జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. తొలి రెండు టెస్టుల్లో యువ క్రికెటర్లుకు ఎక్కువ అవకాశం ఇచ్చిన టీమిండియా.. మూడు టెస్టుల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అలాగే ఆ మ్యాచ్‌లో రాణించిన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరం అయ్యారు. అలాగే వ్యక్తిగత కారణాలతో టీమిండియా సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం అందుబాటులో లేకుండా పోయాడు. మరి వీరంత చివరి మూడు టెస్టుకు అందుబాటులో ఉంటారా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో జట్టు ప్రకటనలో వారి పేర్లు ఉన్నాయో లేదో ఇప్పుడు చూద్దాం..
కాగా, తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో టీమ్ కు దూరమైయ్యాడు. అలాగే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన.. శుబ్‌మన్ గిల్ మాత్రం తన స్థానం కాపాడుకున్నాడు. రెండో టెస్టులో విశ్రాంతి తీసుకున్న మొహమ్మద్ సిరాజ్ మూడో టెస్టుకు తిరిగొచ్చాడు. కొత్త కుర్రాడు ఆకాష్ దీప్ కు తొలిసారి అవకాశం కల్పించారు సెలెక్టర్లు. అతడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున 7 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ లేకపోవడ టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే? జడేజా, రాహుల్ ఫిట్ నెస్ పై ఎన్సీఏ ఇంకా ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. వారిచ్చే సర్టిఫికెట్ పైనే వారు మిగిలిన టెస్టులకు అందుబాటులో ఉంటారా? ఉండరా? అన్నది ఆధారపడి ఉంటుంది.
టీమిండియా జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా(వైస్ కెప్టెన్), జైస్వాల్, శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జూరెల్(కీపర్), కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, ఆకాష్ దీప్.
India’s squad for the last 3 Tests:
Rohit (C), Bumrah, Jaiswal, Gill, KL*, Patidar, Sarfaraz, Jurel, Bharat, Ashwin, Jadeja*, Axar, Sundar, Kuldeep, Siraj, Mukesh and Akash Deep.
– KL and Jadeja participation depends on their fitness.
– Virat Kohli opted out.
– Iyer ruled out. pic.twitter.com/CmPEEDkfV4— Mufaddal Vohra (@mufaddal_vohra) February 10, 2024