టీ20 వరల్డ్ కప్ లో కొత్త రూల్స్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

టీ20 వరల్డ్ కప్ లో కొత్త రూల్స్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ కొత్త రూల్స్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ రూల్ ఏంటి? దాని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ కొత్త రూల్స్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ రూల్ ఏంటి? దాని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా.. అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు క్రికెట్ లవర్స్. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 20 జట్లు పొట్టి కప్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ కొత్త రూల్స్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ రూల్ ఏంటి? దాని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ టీ20 వరల్డ్ కప్ లో గతంలో కనిపించని కొన్ని కొత్త నిబంధనలను తీసుకొస్తోంది ఐసీసీ. అందులో ప్రధానమైంది 60 సెకన్ల స్టాప్ క్లాక్ రూల్. ఈ పొట్టి ప్రపంచ కప్ లో 60 సెకన్ల స్టాప్ క్లాక్ రూల్ ను ఉపయోగించనున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా.. ట్రయల్ పీరియడ్ లో వన్డే మ్యాచ్ ల్లో కనీసం 20 నిమిషాలు ఆదా చేయడం కోసం అపెక్స్ బోర్డు ఈ నిబంధనను తప్పనిసరి చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. ఇక ఈ రూల్ వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న వివరాల్లోకి వెళితే..

60 సెకన్ల స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం.. ఓవర్ వేయడం పూర్తి అయిన తర్వాత వెంటనే 60 సెకన్ల లోపు మరో బౌలర్ బౌలింగ్ ప్రారంభించాలి.  లేదంటే? బ్యాటింగ్ చేసే జట్టుకు పెనాల్టీ కింద 5 పరుగులను అదనంగా ఇస్తారు. దాంతో బ్యాటింగ్ చేసే జట్టుకు ఇది లాభమే. అయితే వికెట్ పడి మరో బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చేటప్పుడు, అంపైర్ బ్రేక్ ఇచ్చినప్పుడు, గాయం కారణంగా ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు ఈ రూల్ వర్తించదు.

కాగా.. ఈ రూల్ ను 2023 డిసెంబర్ లో మధ్యంతర ప్రాతిపదికన ప్రవేశపెట్టినప్పటికీ.. ట్రయల్ పీరియడ్ తర్వాత 20 నిమిషాల సమయం ఆదా తర్వాతనే ఈ రూల్ ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ 60 సెకన్ల సమయాన్ని గ్రౌండ్ లో ఎలక్ట్రానికి గడియారంలో ప్రదర్శిస్తారు. కేవలం సమయాన్ని ఆదా చేయడానికే ఈ రూల్ ను ఐసీసీ తీసుకొచ్చింది. కెప్టెన్లు నిర్లక్ష్యం వహిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. 5 పరుగుల పెనాల్టీ అంటే మ్యాచ్ ఫలితాన్నే మార్చే వీలుంటుంది. ఈ రూల్ ఇరు జట్లకు సమానంగా వర్తిస్తుంది. మరి ఐసీసీ తీసుకొచ్చిన ఈ రూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments